ETV Bharat / business

ధీమా ఇచ్చే బీమా రంగంపై కరోనా కాటు! - కరోనా కాలంలో ఆరోగ్య బీమాలు

బీమా.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆదుకునే సాధనం. ఆరోగ్యం, జీవితం, వాహనం ఇలా అన్నింటికీ సంబంధించిన సమస్యలకు ఇవి పరిష్కారం చూపుతాయి. అయితే ఇలా సంక్షోభంలో ధీమా ఇచ్చే బీమా రంగమే ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకుంది. గత కొంత కాలంగా నెలకొన్న పరిస్థితులతో అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. ఆ సమస్యలు ఏమిటి? వాటికి బీమా సంస్థలు కోరుతున్న పరిష్కారాలు ఏమిటి?

corona impact on insurance sector
బీమా సంస్థలపై కరోనా పడగ
author img

By

Published : Jul 17, 2020, 2:36 PM IST

ప్రపంచమంతా ఇప్పుడు ఎక్కడ చూసినా.. కరోనా సంక్షోభం గురించే చర్చ. ఈ మహమ్మారి ప్రజల ఆరోగ్యంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలను తీవ్రంగా కుంగదీసింది.

ఏదైనా సంక్షోభం ఎదురైతే ఆర్థికంగా బీమా సంస్థలు అండగా ఉంటాయి. అయితే కొవిడ్-19 వల్ల ఆ సంస్థలు కూడా అనిశ్చితి ఎదుర్కొంటున్నట్లు ఆ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బీమా రంగం పరిస్థితి మెరుగ్గానే ఉన్నా.. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయని అంటున్నారు.

జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా ఇలా అన్నింటిపై కరోనా ప్రభావం పడిందని విశ్లేషిస్తున్నారు నిపుణులు.

కరోనాకు ముందు ఇలా..

బీమా రంగంలో ఫిబ్రవరి 2020 వరకు పరిస్థితి సజావుగానే ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు ఆరోగ్యేతర బీమా విభాగంలో 13 శాతం వృద్ధి, జీవిత బీమా విభాగంలో 18 శాతం వృద్ధి నమోదైంది. కరోనా వ్యాప్తితో ఈ లెక్కలన్నీ తారుమారయ్యాయి.

వైరస్ సంక్షోభంతో ప్రజల ఆదాయాల్లో మార్పులు వచ్చాయి. కొత్తగా బీమా తీసుకునే వినియోగదారుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే బీమా తీసుకున్న వారూ పాలసీ రెన్యువల్​ వాయిదా వేసుకుంటున్నట్లు బీమా సంస్థలు చెబుతున్నాయి.

ఆరోగ్య బీమాపై ఆర్థిక భారం..

ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు 2-3 సంవత్సరాల వరకు బీమా సంస్థలు క్లెయిమ్స్ పైనే దృష్టి సారించేలా ఉన్నాయని బీమా రంగంలోని వారు అంటున్నారు. కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖర్చు ఎక్కువవుతోంది. కేసులు పెరుగుతుండటం వల్ల క్లెయిమ్​లు కూడా పెరుగుతున్నాయి. ఇవి ఆరోగ్య బీమా సంస్థలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి.

నిజానికి కరోనా వల్ల కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. అయితే క్లెయిమ్​ రేటుతో పోలిస్తే.. కొత్తగా పాలసీ తీసుకునే వారు తక్కువగా ఉన్నట్లు చెబుతున్నాయి బీమా సంస్థలు. ఈ కారణంగా ఆరోగ్య బీమా సంస్థలు నష్టాలవైపు పయనిస్తున్నట్లు ఆ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. రెన్యువల్ గడువు పెంచటం వల్ల ఈ నష్టాలు మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉపశమనంతోనే ఉపయోగం..

కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించింది. ప్రభుత్వ బాండ్లపైనా వడ్డీ రేట్లు తగ్గాయి. దీని కారణంగా బీమా సంస్థలు అధిక మొత్తాలను నిల్వ చేయడం కష్టంగా మారింది. నిల్వ మొత్తాలపై కొన్ని నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తే.. బీమా సంస్థలకు కొంతమేర ప్రయోజనం కలుగుతుందని బీమా రంగ నిపుణులు చెబుతున్నారు.

"ఆరోగ్య బీమా రంగం ముందు కరోనా మహమ్మారి అనేక సవాళ్లను ఉంచింది. కరోనా కారణంగా ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన మాత్రం పెరిగింది. ఈ మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరికి కరోనా బీమా పాలసీ ఉండటం అత్యవసరం. కరోనా కోసం పలు ప్రత్యేక పాలసీలను కూడా బీమా సంస్థలు ప్రవేశపెట్టనున్నాయి."

- నవల్ గోయల్, సీఈఓ, పాలసీఎక్స్ జీవిత బీమా

జీవిత బీమాకు కష్టకాలం..

జీవిత బీమా రంగానికి.. జీవిత బీమా పాలసీలు, టర్మ్ పాలసీలు, పెట్టుబడి ఆధారిత పాలసీలు, సెమీ గ్యారెంటీడ్ పాలసీల నుంచి అధిక రాబడి వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పాలసీలను కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఆదాయాలు పడిపోవటం వల్ల టర్మ్ పాలసీల కొనుగోలుకు ప్రజలు మొగ్గుచూపటం లేదు. టర్మ్ పాలసీల్లో కొన్నింటిని తీసుకునేందుకు వినియోదారుడు మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఇందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారని బీమా రంగ నిపుణులు చెబుతున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తగ్గేందుకు ఇదీ ఓ కారణమేనంటున్నారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వల్ల దీర్ఘ కాల పాలసీలపై మోజు తగ్గినట్లు అభిప్రాయపడుతున్నారు.

మార్పులు అవసరం..

జీవిత బీమా రంగం మళ్లీ సాధారణ స్థితికి చేరాలంటే నెట్​వర్క్ ఆస్పత్రుల పరిమితిని పెంచాలని కోరుతున్నాయి బీమా సంస్థలు. ప్రీ ఆథరైజేషన్, ధ్రువీకరణ నిబంధనలను సడలించాలని అంటున్నాయి. జీవిత బీమా, పెన్షన్ పాలసీలు, దీర్ఘకాలిక పాలసీల రెన్యువల్ నిబంధనలలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు అవసరమని గుర్తుచేస్తున్నాయి.

వాహన బీమా మందగమనం..

గత ఏడాది నుంచి వాహనాల విక్రయాలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. కరోనా లాక్​డౌన్ వల్ల​ వాహన విక్రయాలు కొన్ని రోజులు పూర్తిగా నిలిచిపోయాయి. దీని వల్ల కరోనాకు ముందు నుంచే (2019-20) వాహన బీమా రంగం మందగమనంలో ఉంది. ప్రస్తుతం అమ్మకాలు ప్రారంభమైనా అవి అంతంత మాత్రంగానే ఉన్నాయి.

కొత్త వాహనాల బీమాలు లేకపోవడం కన్నా.. పాత పాలసీల రెన్యువల్స్ ఆగడమే వాహన బీమాలో నష్టాలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. లాక్​డౌన్​లో వాహనాలు బయట తిరగటం తగ్గిపోయింది. దీనితో క్లెయిమ్‌లు కూడా తగ్గినట్లు చెబుతున్నారు.

వాహన బీమాకు ముందున్నవి మంచి రోజులు!

ప్రస్తుతం క్లెయిమ్​లు కూడా కష్టంగా మారటం వల్ల వినియోగదారులు వాహన బీమా పాలసీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించటం లేదు. కొత్త బీమా పాలసీల కొనుగోలు లేకపోయినా క్లెయిమ్స్‌ తక్కువగా ఉండడం వల్ల మోటారు వాహన బీమా రంగం ఇప్పుడిప్పుడే కొలుకుంటోందని నిపుణులు అంటున్నారు.

"ప్రస్తుతం కరోనా ప్రభావంతో ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. అలాగే ప్రజా రవాణాను తగ్గించి, ప్రైవేట్ వాహనాల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. చాలా మంది ద్విచక్రవాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుండటం గమనించాల్సిన విషయం. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే బీమా పాలసీలు కూడా కొనుగోలు చేస్తారు. కాబట్టి రానున్న కాలంలో భారీగా మోటార్ బీమా పాలసీల కొనుగోలు జరిగే అవకాశముంది."

-నవల్ గోయల్ సీఈఓ, పాలసీ ఎక్స్

ఇదీ చూడండి:లాక్​డౌన్​ కాలంలో 6.5 లక్షల ఉద్యోగాల కోత​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.