ETV Bharat / business

2021-22 ఐటీఆర్​ దాఖలు గడువు పెంపు

author img

By

Published : Sep 9, 2021, 7:55 PM IST

Updated : Sep 9, 2021, 8:33 PM IST

2021-22 మదింపు సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు తేదీని పొడగించింది సీబీడీటీ. ఈ ఏడాది చివరి వరకు ఇందుకు అవకాశమిస్తున్నట్లు తెలిపింది.

CBDT
సీబీడీటీ

పన్ను చెల్లింపుదారులకు కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ). 2021-22 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేసేందుకు గడువును పొడగించింది.

ఈ ఏడాది డిసెంబర్​ 31 వరకు రిటర్నులు సమర్పించేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది.

ఐటీఆర్​ దాఖలు చేయడంలో ఇబ్బందుల గురించి పన్ను చెల్లింపుదారుల నుంచి అందిన వినతుల మేరకు గడువును పొడగించినట్లు ఆదాయంపు పన్ను శాఖ వివరించింది.

నిజానికి 2021-22 మదింపు సంవత్సరానికి రిటర్ను సమర్పించేందుకు జులై 31 చివరి తేదీ. అయితే కొవిడ్ సహా పలు ఇతర కారణాల నేపథ్యంలో దీనిని సెప్టెంబర్​ 30కి పెంచింది సీబీడీటీ. తాజాగా దానిని మరో మూడు నెలలు పొడగించింది.

2020-21 మదింపు సంవత్సరానికి గానూ ఆడిట్​ నివేదికలను దాఖలు చేసేందుకు కూడా గడావును పెంచింది సీబీడీటీ. సెప్టెంబర్ 30తో ముగియనున్న ఈ గడువును.. అక్టోబర్​ 31 వరకు పెంచింది. 2021-22 ఆడిట్​ నివేదిక సమర్పించేందుకు తుడి గడువును 2022 జనవరి 15 వరకు పొడగించింది.

ఇదీ చదవండి: వచ్చే నెల నుంచి ఆ బ్యాంకుల చెక్‌బుక్‌లు పనిచేయవు!

Last Updated : Sep 9, 2021, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.