కార్మిక చట్టాల్లో భారీ మార్పులు తెచ్చే దిశగా భారీ సవరణలతో కూడిన 'వేజ్ కోడ్ బిల్లు'ను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని భావిస్తోంది కార్మిక మంత్రిత్వ శాఖ. అంతకన్నా ముందు వచ్చేవారం ఈ బిల్లు కేబినెట్ అనుమతి పొందనుంది.
లోక్ సభలో ఈ బిల్లు 2017 ఆగస్టు 10న ప్రవేశపెట్టారు. 2017 ఆగస్టు 21న పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపించారు. దీనిపై 2018 డిసెంబర్ 18న ప్యానెల్ నివేదికను సమర్పించింది. అయితే గత నెలలో 16వ లోక్ సభ రద్దయిన కారణంగా ఈ బిల్లు గడువు ముగిసింది.
కార్మిక చట్టాల్లో భారీ మార్పులు
ఈ వేజ్ కోడ్ బిల్లు ప్రస్తుతం ఉన్న 44 కార్మిక చట్టాలను సవరిస్తూ.. వ్యాపారాల నిర్వహణను సులభతం చేసి పెట్టబడులను పెంపొందించేందుకు ఈ బిల్లును రూపొందించింది మంత్రిత్వ శాఖ. సామాజిక భద్రత, పరిశ్రమల రక్షణ, సంక్షేమం సహా.. పరిశ్రమ సంబంధాలు వంటి నాలుగు అంశాలను ప్రధానంగా ఈ బిల్లులో పొందుపరిచారు.
ఈ బిల్లు ఆమోదం పొందితే.. లావాదేవీల వేజ్ చట్టం 1936, కనీస వేతన చట్టం 1948, బోనస్ చట్టం 1965, సమాన వేతన చట్టం 1976లు మారి.. వాటిని ఈ నూతన చట్టం అమల్లోకి రానుంది. వేతనాల్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.
కనీస వేతనంపై నిర్ణయాధికారం
ఈ బిల్లు ద్వారా రైల్వే, మైనింగ్ రంగాలు సహా కొన్ని ఇతర రంగాల్లో కనీస వేతనాలను కేంద్రం నిర్ణయిస్తుంది. కొన్ని రంగాల్లో కనీస వేతనాలు నిర్ణయించుకునేందకు రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
ఈ నెల ఆరంభంలో కేంద్ర మంత్రుల అంతర్గత సమావేశంలో ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కార్మిక వేజ్కోడ్ బిల్లు ప్రవేశపెట్టే అంశం చర్చకు వచ్చింది. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 10గ్రా.. రూ.40వేల దిశగా పసిడి పరుగులు!