ETV Bharat / business

బడ్జెట్​ ప్రత్యేక యాప్​ ఫీచర్లు ఇవే.. - యూనియన్​ బడ్జెట్ యాప్ ఉపయోగాలు

కరోనా నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ ప్రతులు ముద్రించలేదు ఆర్థిక శాఖ. సామాన్యులు బడ్జెట్ వివరాలు సులభంగా తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్​ను తీసుకొచ్చింది. ఆ యాప్ ఎలా వాడాలి? ఎలాంటి సమాచారం యాప్​ నుంచి పొందొచ్చు? అనే వివరాలు మీ కోసం.

Union Budget app key Features
ఒక్క యాప్​తో బడ్జెట్ మొత్తం తెలుసుకోవచ్చు
author img

By

Published : Feb 1, 2021, 10:32 AM IST

బడ్జెట్‌-2021 ప్రతులను సామాన్యులకూ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. గతంలోనూ బడ్జెట్‌ పత్రాలను వెబ్‌సైట్‌లో పొందే వీలున్నా.. దాన్ని మరింత సులభతరం చేస్తూ, మరిన్ని ఫీచర్లు జోడిస్తూ ఈ యాప్‌ను తీసుకొచ్చారు. 'యూనియల్ బడ్జెట్ మొబైల్ యాప్​'ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల విడుదల చేశారు. నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) దీన్ని రూపొందించింది.

యాప్​ విశేషాలు..

  • బడ్జెట్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి ప్రసంగం, వార్షిక ఆర్థిక నివేదిక, ఆర్థిక బిల్లు.. ఇలా 14 రకాల బడ్జెట్‌ పత్రాలను ఈ యాప్‌లో పొందొచ్చు.
  • హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ పత్రాలు అందుబాటులో ఉంటాయి.
  • మొబైల్‌లో బడ్జెట్‌ పత్రాలను వీక్షించడమే కాక.. డౌన్‌లోడ్‌ చేసుకునే వీలూ ఉంది. పత్రాలను ప్రింట్‌ కూడా చేసుకోవచ్చు.
  • జూమ్‌ ఇన్‌, జూమ్‌ ఔట్‌ ఫీచర్ల ద్వారా సులువుగా చదువుకోవచ్చు. బడ్జెట్‌లో మనకు కావాల్సిన సమాచారం కోసం సెర్చ్‌ చేసే వెసులుబాటూ కల్పించారు.
  • బడ్జెట్‌లో భాగంగా ఉదహరించిన ఇతర లింకులనూ యాక్సెస్‌ చేయొచ్చు.
  • ఆండ్రాయిడ్‌ వినియోగదారులు ఈ యాప్‌ను బడ్జెట్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన తర్వాత ఈ యాప్‌లో బడ్జెట్‌ పత్రాలు అందుబాటులోకి వస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.