ETV Bharat / business

'పౌండ్'​ భారీ పతనం-1985 తర్వాత ఇదే ప్రథమం - US DOLLER

అమెరికా డాలర్​తో పోలిస్తే రికార్డుస్థాయి కనిష్ఠానికి పడిపోయింది బ్రిటన్​ కరెన్సీ​ పౌండ్​ స్టెర్లింగ్​. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 1.9 శాతం క్షీణించింది. కరోనా భయాలతో మదుపరులు పెట్టుబడులను ఉపసంహరించుకోవడమే ఇందుకు కారణం.

British pound nosedives against dollar to 1985 low
'పౌండ్'​ భారీ పతనం-1985 తర్వాత ఇదే ప్రథమం
author img

By

Published : Mar 18, 2020, 7:28 PM IST

కరోనా వైరస్​ ప్రభావంతో అమెరికా డాలర్​తో పోలిస్తే రికార్డుస్థాయి కనిష్ఠానికి పడిపోయింది బ్రిటన్​ కరెన్సీ​ పౌండ్​ స్టెర్లింగ్​. ఐరోపాలో మహమ్మారి మరింత ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మదుపరులు ముందుజాగ్రత్తగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా పౌండ్​ ఏకంగా 1.9 శాతం క్షీణించి చివరకు 1.1861 అమెరికన్​ డాలర్​ వద్ద స్థిరపడింది. 1985 తర్వాత పౌండ్​ ఈ స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

చైనాలో మొదలైన కరోనా వైరస్​ ప్రపంచదేశాల్లో చాలా వరకు విస్తరించింది. ఈ మహమ్మారి ప్రభావం ఐరోపాలో తీవ్రమైంది. మరణాల్లో ఆసియాను మించింది. ఇప్పటికే ఇటలీలో 2,500 మందికిపైగా మరణించారు. మరో 31వేల మంది కరోనా బారినపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.