ETV Bharat / business

బంగారాన్ని విడిపించుకోవడం లేదు!

author img

By

Published : Jun 2, 2021, 6:56 AM IST

కొవిడ్‌-19 వల్ల ఎంతో మందిపై ఆర్థికంగా ప్రతికూల ప్రభావం పడింది. దీనితో ఆదాయాలు తగ్గిన వారంతా.. అప్పులు చేయాల్సి వస్తోంది. చాలా మంది బంగారం తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. ఇలా రుణాలు తీసుకున్న వారిలో చాలా మంది అప్పు తిరిగి చెల్లించడం లేదని వెల్లడైంది. దీని వల్ల పసిడి రుణాల్లో ఎన్‌పీఏలు భారీగా పెరగొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.

gold mortgage loans increase
పెరిగిన పసిడి తనఖా రుణాలు

కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్న వారి సంఖ్య కొన్ని రెట్లు పెరిగింది. అయితే.. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లతో పాటు, బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణం తఇచ్చే సంస్థలకూ ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. బంగారాన్ని కుదవపెట్టి, అప్పు తీసుకుంటున్న వారిలో బాకీలు తీర్చని కేసులు పెరుగుతున్నాయి. మణప్పురం ఫైనాన్స్‌ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా టన్ను బంగారాన్ని వేలం వేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విలువ దాదాపు రూ.404 కోట్లు. సాధారణంగా బ్యాంకుల్లో బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి ఏడాది కాలావధికి రుణాలు తీసుకుంటారు. గతేడాది లాక్‌డౌన్‌లు ముగిశాక, ఆర్థిక అవసరాల కోసం మూడో త్రైమాసికంలో పసిడి తనఖా రుణాలను ఎక్కువగా తీసుకున్నారని సమాచారం. అంటే వచ్చే సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంకులు సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది.

విలువలో 90 శాతం వరకు ఇవ్వడంతో..

గత ఏడాది కరోనా మొదటి దశ వల్ల ఎదురైన ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో బంగారం విలువపై 90శాతం వరకు రుణం ఇచ్చేందుకు ఆర్‌బీఐ వెసులుబాటు కల్పించింది. బంగారం ధర జీవిత కాల గరిష్ఠానికి (గ్రాము రూ.5600కు పైగా) చేరడంతో గత ఏడాదిలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అధికమొత్తం రుణంగా ఇచ్చాయి. తదుపరి బంగారం ధర తగ్గింది. కొవిడ్‌ రెండోదశ వల్ల ప్రజల ఆర్థిక స్థితి మెరుగవ్వలేదనే అంచనాలున్నాయి. అందువల్ల బకాయి తీర్చి, ఆభరణాలు విడిపించుకునే పరిస్థితి ఎక్కువమందికి ఉండదని భావిస్తున్నారు. ఈ పరిణామమే ఆర్థికసంస్థల మెడకు చుట్టుకునే ప్రమాదం ఏర్పడింది.

ప్రభుత్వ బ్యాంకుల సహకారంతో

ప్రభుత్వ బ్యాంకులు కూడా విరివిగా పసిడి తనఖా రుణాలివ్వడంతో, గత ఆర్థిక సంవత్సరంలో సంఘటిత రంగమే దాదాపు రూ.2 లక్షల కోట్ల దాకా పసిడి తనఖా రుణాలిచ్చింది. ఇందులో రూ.1.2లక్షల కోట్ల వరకు ప్రభుత్వ బ్యాంకులు ఇవ్వగా.. మిగతా రూ.80వేల కోట్లను ఎన్‌బీఎఫ్‌సీలు అందించాయి. కొన్నేళ్ల క్రితం చూస్తే స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పసిడి తనఖా రుణాలను ఏడాదికి రూ.3000 కోట్ల మేర ఇస్తే, గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగమే రూ.20000 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో సంఘటిత రంగం ఇలా ఇచ్చిన రుణాలు రూ.1.6లక్షల కోట్లుగా ఉన్నాయి. దేశీయంగా బంగారం తనఖా రుణాల మార్కెట్‌ విలువ రూ.6లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో 75 శాతం వరకు అసంఘటిత రంగంలోని సంస్థలే రుణాలు ఇస్తున్నాయి.

సెప్టెంబరు నుంచీ చూడాల్సిందే

పసిడి రుణాలను గతేడాది సెప్టెంబరు తర్వాతే అధికంగా ఇచ్చిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచే పసిడి రుణాల్లో ఎన్‌పీఏలు ఏ మేరకు ఉంటాయనేది తేలుతుంది. ఇక్రా లాంటి రేటింగ్‌ సంస్థలు మాత్రం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో బంగారం రుణాల ఎన్‌పీఏలు పెద్దగా నమోదు కాకపోవచ్చని అంచనాలు వేస్తున్నాయి. పసిడి విలువలో ఎంతమేర ఇవ్వాలనే విషయంలో ఆచితూచి వ్యవహరించడం వల్ల, నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏల)పై భయమేమీ లేదని ఎస్‌బీఐ ఎండీ సీ.ఎస్‌.శెట్టి పేర్కొన్నారు.

3-6-12 నెలల వ్యవధికి

మణప్పురం మూడు నెలల వ్యవధికి ఈ రుణాలు ఇస్తుంది. ఇతర సంస్థలు 6-12 నెలలు వ్యవధికి రుణాలు ఇస్తుండగా.. బ్యాంకులు బంగారంపై రుణాలకు ఏడాది వ్యవధిని ఇస్తుంటాయి.

ఇదీ చదవండి:మే నెలలో కనిష్ఠానికి ఇంధన అమ్మకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.