ETV Bharat / business

అక్షయ తృతీయ: లాక్​డౌన్​లోనూ బంగారం కొనండిలా...

సాధారణంగా అక్షయ తృతీయ వచ్చిందంటే చాలా మంది పసిడి కొనుగోళ్లకు ఎగబడతారు. అయితే కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో ఈసారి నేరుగా దుకాణాల్లో బంగారం కొనడం కష్టం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ పర్వ దినాన బంగారం కొనుగోలు చేసేందుకు ఉన్న అవకాశాలేమిటో తెలుసుకుందాం.

Akshaya Tritiya Gold Demand
అక్షయ తృతీయ నాడు పసిడి డిమాండ్
author img

By

Published : May 13, 2021, 5:02 PM IST

అక్షయ తృతీయ హిందువులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఈ పవిత్ర దినాన.. ధర ఎంత ఉన్నా చిన్న మొత్తంలోనైనా బంగారం కొనాలని భావిస్తుంటారు చాలా మంది.

ఈ ఏడాది అక్షయ తృతీయ మే 14 (శుక్రవారం)న వచ్చింది. శుక్రవారం లక్ష్మీ దేవికి శుభ దినంగా భావించడం, అందులోనూ అక్షయ తృతీయ కావడం వల్ల మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

లాక్​డౌన్​తో సంప్రదాయ కొనుగోళ్లపై ప్రభావం..

కరోనా రెండో దశ యావత్తు దేశంపై సునామీలా విరుచుకుపడుతోంది. రోజుకు సగటున మూడున్నర లక్షలకుపైగా కొత్త కేసులు, దాదాపు 3,500 మరణాలు సంభవిస్తున్నాయి. దీనితో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్​డౌన్ అమలు చేస్తున్నాయి. ఆంక్షల కారణంగా ఇంతకుముందులా షాపింగ్​కు వెళ్లే పరిస్థితి లేదు.

2020లోనూ ఇలాంటి సమస్యే వచ్చినా ఆన్​లైన్​లో పసిడి కొనుగోళ్లకు అనుమతులు ఉండేవి. దీనితో చాలా మంది అన్​లైన్​లో పసిడి కొనుగోలు చేయగలిగారు. అయినప్పటికీ గత ఏడాది అక్షయ తృతీయ పసిడి విక్రయాలు 95 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ సారి కొవిడ్ తీవ్రత నేపథ్యంలో లాక్​డౌన్ కాస్త కఠినంగా అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీనితో అత్యవసరాలు తప్ప బంగారం, నగల వంటి వాటి డెలివరీకి చాలా చోట్ల అనుమతులు లేవు. దీనితో ఆన్​లైన్​లోనూ పసిడి కొనుగోలు కష్టమే.

మరి ఈసారి బంగారం ఎలా కొనాలి?

లాక్​డౌన్​ వల్ల.. భౌతికంగా, ఆన్​లైన్​లో​ బంగారం కొనుగోలు చేయడం ఇప్పుడు కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో పసిడి కొనుగోలు చేయొచ్చు.

గోల్డ్​ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల‌ు(ఈటీఎఫ్‌) ఇందుకు సరిగ్గా సరిపోతాయి. స్టాక్ మార్కెట్లలో షేర్ల లాంటివే ఈటీఎఫ్​లు. ఇందులో కనీసం ఒక ఈటీఎఫ్​ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని విక్రయించుకునే వీలుంది. అయితే ఈటీఎఫ్​ల రూపంలో బంగారం కొనేందుకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరి.

డీమ్యాట్​ ఖాతా లేకున్నా కూడా పసడి కొనుగోలు చేసేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. గూగుల్​పే, పేటీఎం వంటి పేమెంట్స్ యాప్స్ ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఒక్క రూపాయితో కూడా వీటిల్లో పసిడి కొనుగోలు చేయొచ్చు. వీటిని కూడా ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. అయితే వీటికి జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుంది.

భౌతికంగా బంగారంతో పోలిస్తే.. వీటిల్లో తరుగు, ఇతర భద్రతాపరమైన సమస్యలు కూడా ఉండవు.

అక్షయ తృతీయకు ఎందుకంత ప్రత్యేకత?

అక్షయ అంటే తరగనిది అని అర్థం. పురాణాల్లో అక్షయపాత్ర గురించి విని ఉంటాం. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎంత‌మంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వర్యాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏ లోటు ఉండదని నమ్మకం. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు.

వైశాఖ మాసంలో తదియ నాడు వచ్చే పర్వదినాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభం కావడం వల్ల ఈ తిథికి అంత విశిష్టత ఏర్పడింది.

సంపదలకు అధిపతి కుబేరుడు శివుడ్ని ప్రార్థించగా ఆయన లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చినట్టు శివపురాణం తెలుపుతోంది. మహాభారతంలో ధర్మరాజుకు ఈ రోజున అక్షయపాత్ర ఇవ్వడం, గంగానది ఆ పరమేశ్వరుని జటాజూటం నుంచి భువిపైకి అవతరించిన పవిత్ర దినం అక్షయ తృతీయ కావడం విశేషం. పరశురాముడిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించిన దినమిది. ఇన్ని విశిష్టతలు ఉన్నందున అక్షయతృతీయను ఘనంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక పర్వ దినాన పసిడి కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం తమ వద్ద సిరులు ఉంటాయని నమ్ముతారు చాలా మంది. అందుకే అక్షయ తృతీయ నాడు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.