ETV Bharat / business

ఉల్లి ఘాటు తగ్గకముందే.. వంట నూనెల మంట! - హోల్​ సేల్ మార్కెట్​లో వంట నూనెల ధరలు

దేశవ్యాప్తంగా ఇంకా ఉల్లి ఘాటు తగ్గనేలేదు.. ఇప్పుడు వంట నూనేల మంట ప్రారంభమైంది. ఇటీవల వంట నూనెల ధరలు క్రమంగా పెరుగుతూ సామాన్యులకు భారంగా మారుతున్నాయి. దీనికి గల కారణాలేంటి? విశ్లేషకులు ఏమంటున్నారు?

why edible oil Prices rising
వంట నూనెల పెరుగుదలకు కారణాలు
author img

By

Published : Nov 10, 2020, 1:47 PM IST

కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఉల్లి ఘాటు, బంగాలదుంపల ధరల మోత కొనసాగుతోంది. ఈ జాబితాలోకి తాజా వంట నూనెలు కూడా చేరి సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. నూనె గింజల ధరలు పెరగటం వల్ల.. వంట నూనేలు ప్రియమవుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన ఆరు నెలల్లో దేశీయ ఫ్యూచర్ మార్కెట్​లో క్రూడ్ పామాయిల్​ (సీపీఓ) ధర 53 శాతం పెరిగింది. మలేసియాలో సోయాబిన్ ఉత్పత్తి భారీగా తగ్గటమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అవాల ధరలు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు చెబుతున్నాయి.

మార్కెట్ వర్గాల ప్రకారం..

ఇటీవల ముడి ఆవాల ధర (హోల్​ సేల్) 10 కిలోలకు రూ.1,155 పలకగా.. సోయా నూనే హోల్​ సేల్ ధర 10 కిలోలకు రూ.995-1010 వద్దకు చేరింది. పామాయిల్ ధర 10 కిలోలు రూ.935-945గా ఉంది.

ఇదే సమయంలో కుసుమ నూనే హోల్​ సేల్ ధర 10కిలోలకు రూ.1,180-1,220 మధ్య పలుకుతోంది.

మరింత పైపైకి ధరలు?

మలేసియాలో పామాయిల్ ఉత్పత్తి తగ్గడం ధరల పెరుగుదకు కారణమైంది. దేశంలో అవాలు, సోయాబిన్ ధరలు సహా ముడి పామాయిల్ ధర పెరగటం వల్ల.. రానున్న రోజుల్లో వంట నూనేలు ఇంకా ప్రియమవ్వచ్చని కేడియా అడ్వైజరీ డైరెక్టర్​ అజయ్​ కేడియా తెలిపారు.

మరోవైపు ప్రపంచమార్కెట్​లోనూ సోయాబిన్, సోయా నూనే ధరలు పెరిగాయి.

ఇదీ చూడండి:'ఫైజర్' ప్రకటనతో జూమ్​ షేర్లు రివర్స్ గేర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.