జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో రాష్ట్రాలు- కేంద్రం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా.. పరిహారం కోసం రుణాలు తీసుకోవాలన్న కేంద్రం ఇచ్ఛికను.. కేరళ, పంజాబ్ సహా 7 భాజపాయేతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. కేంద్రమే న్యాయబద్ధంగా తమకు పరిహారాన్ని చెల్లించాలని స్పష్టం చేశాయి.
ఈ అంశంపై చర్చించేందుకు పంజాబ్, బంగాల్, కేరళ, దిల్లీ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణా రాష్ట్రాలు.. సోమవారం అనధికారికంగా సమావేశమయ్యాయి. జీఎస్టీ పరిహారంలో ప్రత్యామ్నాయాలను పరిశీలించే అవసరం ఉందని ఈ రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి.
అదే సమయంలో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, పుదుచ్చేరి కూడా కేంద్రమిచ్చిన ఆఫర్‌ను వ్యతిరేకించాయి.
ఇదీ చూడండి:- జీఎస్టీ పరిహారంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఈ విషయంపై పంజాబ్ ఆర్థికమంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. గత జీఎస్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పునఃపరిశీలించుకోవాలని కోరారు. మరింత స్పష్టత కోసం అత్యవసర సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాల డిమాండ్...
కరోనాతో నెలకొన్న పరిస్థితులతో తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలు.. జీఎస్టీ పరిహారం చెల్లించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం దిల్లీలో 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ విషయంలో రాష్ట్రాలకు కేంద్రం రెండు ఇచ్ఛికలను ప్రతిపాదించింది.
ఇవీ చూడండి:-