ETV Bharat / business

సైబర్​ భద్రతపై వ్యాపార సంస్థల ఆందోళన

సైబర్​ భద్రతపై భారతలోని 60శాతం సంస్థలు ఆందోళన చెందుతున్నాయని యాక్సెంచర్​ నివేదిక వెల్లడించింది. సైబర్​ భద్రతకు ముప్పు వాటిల్లితే ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై స్పష్టత లేదని తెలిపింది.

సైబర్​ భద్రతపై వ్యాపార సంస్థల ఆందోళన
author img

By

Published : Apr 19, 2019, 1:22 PM IST

సైబర్​ భద్రత విషయంలో భారత దేశం ముప్పు ఎదుర్కొంటుందని ఎప్పటి నుంచో పలు నివేదికలు చెబుతున్నాయి. భారత్​లోని 60 శాతం సంస్థలు ఈవిషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని యాక్సెంచర్​ తాజా నివేదిక స్పష్టం చేసింది. ఆయా సంస్థలకు సైబర్​ భద్రతకు సంబంధించి వ్యవహరించాల్సిన తీరుపైనా స్పష్టత లేదని అంచనా వేసింది.

ప్రపంచ వ్యాప్తంగా 1700 మంది సీఈఓలు, ఇతర ఎగ్జిక్యూటీవ్​లతో మాట్లాడి ఈ సర్వే చేసింది యాక్సెంచర్​. ఇందులో 100 మంది భారతదేశంలోని పెద్ద సంస్థలకు చెందినవారు ఉన్నారు.

డిజిటల్​కూ అవరోధమే....

భారత్​లో 77 శాతం మంది... డిజిటల్​ ఆర్థికవ్యవస్థ అభివృద్ధికి సైబర్​ భద్రతే అవరోధమని అభిప్రాయపడ్డారు. భారీ మార్పులు వచ్చేంత వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
ఒంటరిగా ఏ సంస్థ కూడా సైబర్​ భద్రత సవాళ్లను ఎదుర్కోవటం కష్టమని, ఇందుకోసం ఉమ్మడి కృషి కావాలని 60 శాతం మంది అన్నారు. ప్రభుత్వం కఠిన వ్యాపార నిబంధనలు తీసుకురావాలని 69 శాతం మంది చెప్పారు.

ఐదేళ్లలో 361 లక్షల కోట్లు నష్టం...

"అంతర్జాల ఆధారిత కంపెనీలు సైబర్​ భద్రత కోసం సరైన చర్యలు తీసుకోలేకపోతున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో దాదాపు 361 లక్షల కోట్లు(5.2 ట్రిలియన్​ డాలర్లు) ఆదాయాన్ని కోల్పోవటం కానీ, అదనపు ఖర్చులు చేయటం గానీ జరగవచ్చు" అని నివేదిక అంచనా వేసింది.

Mumbai, Apr 19 (ANI): As Jet Airways announced the temporary suspension of its flight operations, the airline's flight attendant Nidhi Chaphekar urged the Prime Minister Narendra Modi for urgent help to save the debt-ridden carrier. The over 25-year-old Indian airline suspended all its operations on April 17 after lenders rejected its request for Rs 400 crore emergency funding.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.