ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ద్వారా రెవెన్యూ లోటు భర్తీ చేసుకునేందుకు.. కేంద్రం ఇచ్చిన ఒక ఆప్షన్‌కు సగానికి పైగా రాష్ట్రాలు ఓకే అన్నాయి. రూ. 97 వేల కోట్ల రుణ ప్రతిపాదనకు 21కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంగీకరించాయి. వీటిల్లో భాజపా పాలిత రాష్ట్రాలతో పాటు పలు అంశాల్లో ఎన్డీఏ సర్కారుకు మద్దతు తెలుపుతున్న పార్టీలు, అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.
ఈ మేరకు కేంద్రానికి తమ నిర్ణయాన్ని తెలియజేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు అసోం, బిహార్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా 9 రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనపై ఇంకా తమ నిర్ణయాన్ని తెలియజేయలేదని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి.
అక్టోబర్ 5న జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలోపు నిర్ణయాన్ని తెలియజేయని రాష్ట్రాలు.. పరిహారపు బకాయిలు పొందేందుకు 2022 జూన్ వరకూ నిరీక్షించాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: అసలా.. వడ్డీయా..? జీఎస్టీపై కేంద్రం రెండు ఆఫర్లు