ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఎన్నో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసత్య ప్రచారాలను నిరోధించేందుకు సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది వీడియో మాధ్యమం 'యూట్యూబ్'. అధికారికంగా ధ్రువీకరించిన సమాచారం అందించేందుకు.. హోమ్ పేజీలో 'కొవిడ్-19 న్యూస్ సెల్ఫ్'ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
" కరోనాపై ధ్రువీకరించిన సమాచారాన్ని ప్రతి ఒక్కరు పొందటమే మా లక్ష్యం. 16 దేశాల్లో కొవిడ్-19పై న్యూస్ సెల్ఫ్‌ను ప్రారంభిస్తున్నాం. త్వరలోనే మరిన్ని దేశాలకు విస్తరిస్తాం."
- యూట్యూబ్.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌పై ఎక్కువ మంది స్పందిస్తుండం, తప్పుడు సమాచారమనే వాదనలు పెరిగిన నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించింది గూగుల్ అనుబంధ సంస్థ యూట్యూబ్.
పుకార్ల వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ దాదాపు ఇలాంటి చర్యలే చేపడుతున్నట్లు గత బుధవారం ప్రకటించింది.
ఇదీ చూడండి: కరోనాపై పోరుకు ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ టీమ్‌వర్క్