ETV Bharat / business

ఎల్​ఐసీ అండతో ఎస్​ బ్యాంక్ జోరు - ఎస్​ బ్యాంక్​లో పెరిగిన ఎల్​ఐసీ వాటా

ఎస్​ బ్యాంక్​లో ఎల్​ఐసీ వాటా దాదాపు 5 శాతానికి పెంచుకున్న నేపథ్యంలో బ్యాంక్ షేర్లు భారీగా వృద్ధి చెందాయి. బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈల్లో ఎస్​ బ్యాంక్​ షేరు విలువ రూ.14 వద్దకు చేరింది.

yes bank shares jump
ఎస్​ బ్యాంక్ జోరు
author img

By

Published : Aug 7, 2020, 1:02 PM IST

వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నా.. ఎస్​ బ్యాంక్ షేర్లు మాత్రం భారీగా పుంజుకున్నాయి. ఎస్​ బ్యాంక్​లో బీమా దిగ్గజం ఎస్​ఐసీ వాటా పెంచుకోవడం వల్ల.. షేర్లు 5 శాతం మేర పెరిగాయి.

బీఎస్​ఎఈ, ఎన్​ఎన్​ఈలోనూ ఎస్​ బ్యాంక్ షేరు విలువ ప్రస్తుతం రూ.14 వద్ద ఉంది.

వాటా కొనుగోలు ఇలా..

ఓపెన్ మార్కెట్ ద్వారా 105.98 (4.23 శాతం) కోట్ల ఎస్​ బ్యాంక్ షేర్లను ఎల్​ఐసీ కొనుగోలు చేసింది. దీనితో గతంలో ఉన్న 19 (0.75 శాతం) కోట్ల షేర్లతో కలిపి ఎస్​ బ్యాంక్​లో ఎల్​ఐసీ మొత్తం వాటా 4.97 శాతానికి పెరిగింది.

2017 సెప్టెంబర్ 21 నుంచి 2020 జులై 31 మధ్య ఈ వాటాల విక్రయం జరిగినట్లు ఎస్​ బ్యాంక్ ప్రకటించింది.

ఇదీ చూడండి:కరోనా భయాలున్నా తగ్గుతున్న నిరుద్యోగ రేటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.