ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంకు షేర్లు నేడు భారీగా కుదేలయ్యాయి. ఇటీవల ప్రకటించిన 2018-19 నాల్గో త్రైమాసిక ఫలితాల్లో రూ.1,506.64 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది బ్యాంకు.
ముఖ్యంగా మొండి బకాయిలకు కేటాయించే ప్రొవిజన్లు పెరగటం బ్యాంకును భారీ నష్టాల్లోకి నెట్టింది.
వీటికి తోడు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ బ్రోకరేజి రేటింగ్ సంస్థ 'మోక్వారీ' యస్ బ్యాంకు షేర్ల రేటింగ్‌ను రెండంచెలు తగ్గించింది. ఈ నేపథ్యంలో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన షేర్లు మార్కెట్లు ఆరంభమైన కొద్దిసేపటికే దాదాపు 30 శాతం నష్టాల్లోకి జారుకున్నాయి.
సెన్సెక్స్‌లో బ్యాంకు షేరు 29.34శాతం నష్టంతో రూ.167.75కు చేరింది. నిఫ్టీలోనూ 29.41 శాతం నష్టపోయి రూ.167.45 వద్ద కొనసాగుతోంది.