ఎస్ బ్యాంకు కుంభకోణంతో సంబంధమున్న పలుచోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు నిర్వహిస్తోంది. ముంబయిలోని ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్ నివాసంతో పాటు ఆ సంస్థకు చెందిన ఆరు కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు.
రానా కపూర్ బంధువులకు డీహెచ్ఎఫ్ఎల్ ద్వారా రూ.600 కోట్లు పొందారనే అనే ఆరోపణలు ఉన్నాయి. డీహెచ్ఎఫ్ఎల్కు ఆర్థిక సహకారాన్ని పొడిగించారని.. ఈ విషయంలో కపిల్ వధవాన్తోపాటు కపూర్ క్రిమినల్ వివాదంలో చిక్కుకున్నారు.
సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం..
ఈ కుంభకోణం 2018 ఏప్రిల్-జూన్ మధ్య ప్రారంభమయింది. అదే సమయంలో డీహెచ్ఎఫ్ఎల్లో రూ.3,700 కోట్లు ఎస్ బ్యాంకు పెట్టుబడులు పెట్టింది. ఇందుకు ప్రతిఫలంగా డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ వధవాన్.. కపూర్, అతని కుటుంబ సభ్యులకు డబ్బు సమకూర్చారు.
ఇదీ చూడండి: ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడిపై 'మోసం, అవినీతి' కేసులు