ఐటీ దిగ్గజం విప్రోకు కొత్త కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), ఎండీ (మేనేజింగ్ డైరెక్టర్)గా థియర్రీ డెలపోర్టేను నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. థియర్రీ.. క్యాప్ జెమినిలో 25 ఏళ్లపాటు పలు కీలక పదవుల్లో పని చేశారు. జూన్ 6 నుంచి థియర్రీ విప్రో పగ్గాలు చేపట్టనున్నారు.

కొత్త సీఈఓ ఇందుకే..
విప్రోకు ప్రస్తుతం సీఈఓ, ఎండీగా సేవలందిస్తున్న అబిదాలీ నీముచ్వాలా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ఱయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జూన్ 1తో అబిదాలీ పదవీ నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త సీఈఓ, ఎండీని నియమించుకుంది విప్రో.
జూన్ 5 వరకు రోజు వారీ కార్యకలాపాలను ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ పర్యవేక్షిస్తారని విప్రో వెల్లడించింది. సంస్థ బోర్టులోకి ఆర్థిక సేవల నిపుణుడు దీపక్ ఎం సత్వాల్కర్ను తీసుకుంటున్నట్లు కూడా విప్రో పేర్కొంది.
ఇదీ చూడండి:పతంజలి బాండ్ల ఇష్యూ 3 నిమిషాల్లోనే పూర్తి