టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జ్ (ఐయూసీ)ను తొలగించింది. దీనితో జనవరి 1 నుంచి ఇతర నెట్వర్క్ యూజర్లకు కాల్ చేసే నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది.
జియో నెలవారీ యూజర్ల సంఖ్య తగ్గుదల..
2016లో జియో సేవలు ప్రారంభమైన తర్వాత నెలకు సగటున 60 లక్షల మంది కొత్త యూజర్లు పెంచుకుంది. అయితే ఇటీవల మాత్రం ఈ విషయంలో జియో కాస్త వెనకబడింది. ట్రాయ్ గణాంకాలు చూస్తే 2020 సెప్టెంబర్‌లో జియోను కొత్తగా 14.6 లక్షల మంది ఎంచుకుంటే.. ఎయిర్‌టెల్‌ను 37.7 లక్షల మంది ఎయిర్‌టెల్‌ను ఎంపిక చేసుకున్నారు. అక్టోబర్‌లోనూ ఎయిర్టెల్ 36.7 లక్షల మంది కొత్త యూజర్లను రాబట్టగలిగిదే.. జియో 26.5 లక్షలకు పరిమితమైంది.
జియోకు రైతుల నిరసనల సెగ..
పంజాబ్ రైతుల ఆందోళనలూ... జియోకు ప్రతికూలంగా మారాయి. ఆ సంస్థకు మేలు చేసేలా సాగు చట్టాలు ఉన్నాయని ఆరోపిస్తూ చాలా మంది మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌కు మారుతున్నారు. జియో టవర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటివి చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ జియో నెలవారీ యూజర్ల సంఖ్య భారీగా తగ్గేందుకు కారణమయ్యాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఐయూసీని తొలగించడం వల్ల.. జనవరిలో కొత్త యూజర్ల సంఖ్య వృద్ధి తిరిగి సాధారణ స్థితికి చేరుతుందా అనేది జియో ముందున్న ప్రశ్న. కొత్త కొత్త ఆఫర్లతో ఎప్పుడూ వినియోగదారులను ఆకర్షించే జియోపై.. ఇతర నెట్వర్క్ కాల్స్‌పై పరిమితులు విధించడం అనేది కొంత ప్రతికూల ప్రభావం చూపింది. అయితే ఇప్పుడు అది కూడా తొలగిపోయింది. మరి వినియోగదారులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
ఇవీ చూడండి: