ETV Bharat / business

'మూడేళ్లలో ఒక్క షేరు కూడా విక్రయించము'

author img

By

Published : Mar 18, 2020, 7:30 AM IST

సంక్షోభంలో చిక్కుకున్న ఎస్​ బ్యాంక్​పై ఎస్​బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ మరో కీలక ప్రకటన చేశారు. ఎస్ బ్యాంక్​లో తాము తీసుకున్న 60.50 కోట్ల షేర్లను మూడేళ్లలోపు ఒక్కటి కూడా విక్రయించబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం దక్కిన 43 శాతం వాటాను 49 శాతానికి పెంచుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

yes bank news
ఎస్​ బ్యాంకులో షేర్లు విక్రయించం

ఎస్‌ బ్యాంక్‌లో తమ వాటాను 49 శాతానికి పెంచుకుంటామని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ చెప్పారు. అలాగే ప్రస్తుతమున్న 43 శాతం వాటాలో ఒక్క షేరును కూడా మూడేళ్లలోపు (లాక్‌ ఇన్‌ పిరియడ్‌) విక్రయించబోమని స్పష్టం చేశారు. వాస్తవానికి రూ.7,250 కోట్ల పెట్టుబడితో ఎస్‌ బ్యాంక్‌లో 49 శాతం వాటాను తీసుకోవాల్సిందిగా తొలుత ఎస్‌బీఐను అడిగారు. అయితే ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం వల్ల రూ.6,050 కోట్లతో (60.50 కోట్ల షేర్లు) సుమారు 43 శాతం వాటాను మాత్రమే తీసుకోగలిగింది.

'ఎస్‌ బ్యాంక్‌కు తొలి విడత పెట్టుబడి ప్రక్రియ కింద ప్రస్తుతం ఎంతైతే అవసరమో ఆ మేరకు మూలధనం సమకూరింది. అందులో మేమూ తగినంతగా పెట్టుబడి పెట్టాం. ఎస్‌ బ్యాంక్‌ సాధారణ స్థితికి వచ్చి గాడిన పడినందున కొత్తగా మరింత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ.. మా వాటాను 49 శాతానికి పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాం. ఇందుకు బోర్డు అనుమతి తీసుకోవాలని అనుకుంటున్నాం."- రజనీశ్‌ కుమార్‌, ఎస్​బీఐ ఛైర్మన్​

వాటాలు ఇలా..

మరోవైపు రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా ఎస్‌ బ్యాంక్‌లో 7.97 శాతం వాటాను చేజిక్కించుకున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ వెల్లడించింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ 7.97% (పెట్టుబడి రూ.1,000 కోట్లు), యాక్సిస్‌ బ్యాంక్‌ 4.78% (రూ.600 కోట్లు), కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 3.98% (రూ.500 కోట్లు), ఫెడరల్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌లు చెరో 2.39% (రూ.300 కోట్లు), ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.99% (రూ.250 కోట్లు) చొప్పున వాటాలు పొందాయి.

రాణా కపూర్‌పై ఈడీ మరో కేసు

ఎస్‌ బ్యాంక్‌ ప్రమోటరు రాణా కపూర్‌, ఆయన భార్యపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) మరో కొత్త కేసును నమోదుచేసింది. దిల్లీలోని లూటైన్స్‌లో ఓ భవంతిని కొనుగోలు చేసే రూపేణా ఓ స్థిరాస్తి సంస్థ నుంచి రూ.307 కోట్ల మేర లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఆ స్థిరాస్థి సంస్థకు ఎస్‌ బ్యాంక్‌కు రూ.1,900 కోట్ల మేర రుణాలు ఇప్పించినందుకు, వసూళ్లను ఆలస్యం చేసినందుకు ఈ లంచం ఇచ్చిందని ఈడీ పేర్కొంది.

వద్వాన్‌ సోదరులు గైర్హాజరు

రాణాకపూర్‌, ఇతరులపై నమోదైన మనీ లాండరింగ్‌ నియంత్రణ కేసులో భాగంగా ఈడీ ఎదుట విచారణకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు కపిల్‌, ధీరజ్‌ వద్వాన్‌లు గైర్హాజరయ్యారు. ఎస్‌ బ్యాంక్‌, రాణా కపూర్‌, ఆయన కుటుంబంతో లావాదేవీల వ్యవహారాలపై ప్రశ్నించేందుకు ముంబయి కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా వద్వాన్‌ సోదరులకు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి గైర్హాజరైన నేపథ్యంలో కొత్తగా మళ్లీ సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. అలాగే వాళ్లకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయమని కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

రూ.10 వేల కోట్లు వసూలు!

మార్చి త్రైమాసికంలో రూ.8,500-రూ.10,000 కోట్ల మేర వసూలవుతాయని తాము భావిస్తున్నట్లు ఎస్​ బ్యాంక్‌ ఎండీ ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు. ఇప్పటికే మొండి బకాయిల కోసం 72 శాతానికి పైగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు. అలాగే కొత్త మొండి బకాయిలు కూడా ఇంతకుముందు ప్రకటించిన 5 శాతానికి మించి ఉండకపోవచ్చని పేర్కొన్నారు. అలాగే అదనపు టైర్‌-1 బాండ్ల వ్యవహారంపై ఆయన స్పందిస్తూ ఇప్పటికే ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున.. దానిపై ఎక్కువగా చర్చించకూడదని అన్నారు. చిన్న మదుపర్లకు షేర్ల లాక్‌ఇన్‌ పిరియడ్‌కు సంబంధించిన విషయంపై కూడా ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

ఇదీ చూడండి:నేటి నుంచి ఎస్​ బ్యాంకు సేవలు యథాతథం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.