ETV Bharat / business

వాట్సాప్​లో ఈ కొత్త ఫీచర్ల గురించి తెలుసా? - వాట్సాప్

సామాజిక మాధ్యమ వేదిక.. వాట్సాప్​లో కొత్తగా మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు తీసుకొస్తున్న ఆ కొత్త ఫీచర్లు ఏంటి? వాటి ఉపయోగమెంత? అనే విషయాలు మీకోసం.

WhatsApp to Soon Bring This Much-Requested Feature to All Users
వాట్సాప్​లో మరో రెండు కొత్త ఫీచర్లు వచ్చేస్తున్నాయోచ్​!
author img

By

Published : Apr 13, 2020, 11:38 AM IST

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​కు చెందిన మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​లో త్వరలో మరిన్ని అధునాత ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. తమ వినియోగదారులకు చేరువయ్యేందుకు ఇప్పటికే డార్క్​మోడ్​ వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్​.. త్వరలోనే మల్డీ డివైజ్ లాగిన్​, సెల్ఫ్​ డిస్ట్రక్టివ్​ మెసేజెస్​ వంటి సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది.

మల్టీ డివైజ్ సపోర్ట్

ఇతర మెసేజింగ్ ఆపరేటర్లతో పోలిస్తే వాట్సాప్ చాలా ఆలస్యంగా ఫీచర్లను రూపొందిస్తుంది. టెలిగ్రామ్​ యాప్​లో ఇప్పటికే మల్టీ డివైజ్ ఫీచర్ ఉండగా.. వాట్సాప్ మాత్రం ఇప్పటికీ ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే ఈ సదుపాయం తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే ఒకే సమయంలో రెండు డివైజ్​ల నుంచి వాట్సాప్​ను ఉపయోగించుకోవచ్చు. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.

సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెసేజెస్

మెసేజ్​లు వాటంతట అవే డిలీట్ అయ్యే ఫీచర్ ప్రవేశపెట్టేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. స్నాప్​చాట్​లో ఇప్పటికే ఉన్న ఈ ఫీచర్​ను త్వరలో వాట్సాప్​లోనూ చూసే అవకాశం ఉంది. వాట్సాప్ డిలీట్ ఫీచర్​కి, డిస్ట్రక్షన్ ఫీచర్ కాస్త భిన్నం.

మనం ఏ మెసేజ్​లైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో డిస్ట్రక్షన్ ఫీచర్​లో ముందుగానే వాటికి టైమర్ సెట్​ చెయ్యొచ్చు. ఆ సమయంలో మెసేజ్​లు వాటంతట అవే డిలీట్ అయిపోతాయి. ఈ ఫీచర్​ను ఆఫ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత వారం క్రితం మెసేజ్​లను తిరిగి పొందే వీలుంటుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్​.. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.20.110లో అభివృద్ధి చేస్తున్నారు.

సెర్చ్ మెసేజెస్ ఆన్ ది వెబ్

వాట్సాప్​లో నకిలీ మెసేజ్​లకు అంతులేకుండాపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తున్న తరుణంలో ఇలాంటి మెసేజ్​లు మరింత ఎక్కువైపోయాయి. వీటికి చెక్ పెట్టడానికి వాట్సాప్ సరికొత్త ఫీచర్​తో ముందుకు రాబోతోంది.

వాట్సాప్​లో వచ్చిన మెసేజ్​ల విశ్వసనీయతను తెలుసుకోవడానికి 'సెర్చ్ మెసేజెస్ ఆన్ ది వెబ్' ఫీచర్​ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్​ ప్రకారం ఫార్వడ్ చేసిన మెసేజ్​ల ముందు ఓ సెర్చ్ బటన్ ఉంటుంది. ఆ మెసేజ్​కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తనిఖీ చేసి తప్పుడు వార్తలను పసిగట్టే అవకాశం ఉంటుంది.

వీడియో స్టేటస్​లు 15 సెకన్లే

టెలికాం ఆపరేటర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు స్టేటస్ నిడివిని 15 సెకన్లకు తగ్గించింది వాట్సాప్. లాక్​డౌన్​ నేపథ్యంలో డేటా వాడకం పెరిగి నెట్​వర్క్​పై ఎక్కువ లోడ్​ పడుతున్న కారణంగా ఆపరేటర్లు ఈ అభ్యర్థన చేశాయి. భారత్​లోనే ప్రత్యేకంగా ఈ అప్​డేట్ తీసుకొచ్చింది వాట్సాప్. అయితే నెట్​వర్క్​ పరిమితులు చక్కబడిన తర్వాత దీన్ని ఉపసంహరించే అవకాశం ఉంది.

డార్క్​మోడ్

వాట్సాప్ వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫీచర్ ఇది. ఈ ఎదురుచూపులకు తెరదించుతూ ఆండ్రాయిడ్, ఐఓఎస్​ వెర్షన్లలో డార్క్​మోడ్​ను ప్రవేశపెట్టింది వాట్సాప్. రాత్రి పూట ఎక్కువగా వాట్సాప్ వినియోగించినప్పుడు కళ్లకు ఇబ్బందులు కలగకుండా ఈ ఫీచర్ తీసుకొచ్చింది. కాంట్రాస్ట్​, రీడబిలిటీని సైతం మెరుగుపర్చింది వాట్సాప్. డార్క్​మోడ్​లో ఈ ఫీచర్ ఆన్ చేయాలనుకుంటే చాట్స్ థీమ్ సెట్టింగ్స్​లోకి వెళ్లి డార్క్ థీమ్​ను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కళ్లకు ఇబ్బందులు కలగకుండా రాత్రి సమయంలోనూ మీ సన్నిహితులతో చాట్ చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.