ETV Bharat / business

వాట్సాప్​ నుంచి త్వరలో అద్భుతమైన ఫీచర్​! - వాట్సాప్ లేటెస్ట్ న్యూస్

వాట్సాప్​ నుంచి త్వరలో అద్భుతమైన ఫీచర్​ రానున్నట్లు తెలుస్తోంది. ఏకంగా నాలుగు డివైజుల్లో ఈ యాప్​ను వినియోగించే వీలును కల్పించనుంది సంస్థ. ఇప్పటికే డెవలపర్లు యాప్​ను ఇందుకోసం సిద్ధం చేస్తున్నట్లు వాట్సాప్​ బీటా ఇన్ఫో వెల్లడించింది.

WHATSAPP LATEST FEATURE
వాట్సాప్
author img

By

Published : Jun 14, 2020, 6:52 AM IST

వాట్సాప్​.. ప్రపంచంలో అత్యధికులు ఉపయోగించే మెసేజ్​ యాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తూ వినియోగదారులకు మరింత చేరువవుతోంది. ఇతర యాప్‌ల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు కొత్త ఫీచర్లను జోడిస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓ ఫీచర్‌పై వాట్సాప్‌ తీవ్రంగా కృషి చేస్తోందట.

ప్రస్తుతం వాట్సాప్‌ ఖాతాను ఒక డివైజ్‌లో మాత్రమే వినియోగించే వీలుంది. వెబ్‌ వాట్సాప్‌ ద్వారా కంప్యూటర్​కు అనుసంధానించవచ్చు. అది కూడా కొన్ని పరిమితులతోనే సాధ్యమవుతుంది. కానీ ఒకే అకౌంట్‌తో మరో మొబైల్‌ లేదా ఇతర గాడ్జెట్‌లలో వినియోగించాలంటే కుదరదు. ఒకవేళ వేరే డివైజ్​లో లాగిన్ అయితే మరొకటి దానంతట అదే లాగ్​ఔట్​ అవుతుంది. ఇప్పుడు ఆ ఇబ్బందిని తొలగించేందుకు వాట్సాప్​ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

నాలుగింటిలో..

వాట్సాప్​లో ఈ ఫీచర్​ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు కాదు, ఏకంగా నాలుగు డివైజ్‌లలో ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను వినియోగించేలా యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు వాట్సాప్‌ బీటా ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది.

"అవును ఒకేసారి నాలుగు డివైజ్‌లలో వాట్సాప్‌ను వినియోగించవచ్చు. ప్రస్తుతం దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒక గొప్ప విషయం."

- వాట్సాప్‌ బీటా ఇన్ఫో

వైఫై కనెక్షన్‌ ద్వారా ఇతర డివైజ్‌లనూ వాట్సాప్‌ లాగిన్‌ అయ్యేలా దీనిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత మొబైల్‌ డేటా ఆప్షన్‌ కూడా జత చేసే అవకాశం ఉంది. కొన్ని ట్యాబ్లెడ్‌, హైబ్రీడ్‌ ల్యాప్‌టాప్‌లకు మొబైల్‌ కనెక్షన్‌ వెసులుబాటు ఉండదు. ఇలాంటి వాటిలో వాట్సాప్‌ వినియోగించాలంటే కష్టం. అయితే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే, ఆ ఇబ్బందులు తప్పనున్నాయి.

మరిన్ని ఫీచర్లు..!

దీనికి అదనంగా వాట్సాప్​ మరిన్ని ఫీచర్లపై ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చాట్​ హిస్టరీలో డేట్​ ఆధారంగా సెర్చింగ్ ఆప్షన్​ను అందించనుంది. దీని వల్ల సందేశాలు, ఫొటోలు, వీడియోలతో పాటు ఇతర వివరాలను సులభంగా వెతుక్కునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఐఏఎస్​పై ప్రయోగాలు నిర్వహిస్తోంది. త్వరలోనే ఆండ్రాయిడ్​లోనూ తీసుకురానుంది. వెబ్​ వెర్షన్​లోనూ పనిచేస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

ఎన్​హాన్స్​డ్​ స్టోరేజీ యూసేజీ, క్లియర్ చాట్​ ఫీచర్​, షేర్​చాట్​ సపోర్ట్​ ఇలా ఇంకొన్ని అంశాలు జోడించనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.