ETV Bharat / business

ఇక వాట్సాప్​లో ఒకేసారి 50 మందికి వీడియోకాల్​​! - wtsapp messenger rooms

ఫేస్​బుక్​ సరికొత్త ఫీచర్​ 'మెసెంజర్​ రూమ్స్​' ఇక వాట్సాప్​లో దర్శనమివ్వనుంది. అవును, ఈ వెసులుబాటుతో వాట్సాప్​ వెబ్​ తెరిస్తే చాలు.. 50 మందితో ఒకేసారి వీడియోకాల్​ మాట్లాడుకోవచ్చు. అదెలా అంటారా?

whatsapp-for-web-to-integrate-with-messenger-rooms-soon
ఇక వాట్సప్​తో ఒకేసారి 50 మందికి వీడియోకాల్​​!
author img

By

Published : May 12, 2020, 11:32 AM IST

జూమ్​ వంటి దిగ్గజ వీడియో కాన్ఫెరెన్సింగ్​ యాప్​లను తలదన్నేలా... ఫేస్‌బుక్ తీసుకొచ్చిన 'మెసెంజర్ రూమ్స్​' త్వరలో వాట్సాప్ వెబ్​లో కనిపించనుంది. అవును.. ఇక మీ ల్యాప్​టాప్​లు, పీసీల్లో వాట్సప్​ తెరిస్తే.. 'ఫైల్​ అటాచ్ బటన్' కింద "ఈ మెసెంజర్​ రూమ్స్" షార్ట్​కట్​ అందుబాటులోకి రానుంది.

గత నెల ఫేస్​బుక్​ సరికొత్త వీడియో కాన్ఫెరెన్సింగ్ టూల్​ను విడుదల చేసింది. అదే '​మెసెంజర్​ రూమ్స్​'. ఈ మెసెంజర్​ రూమ్స్​లో ఒకేసారి 50 మందితో వీడియో కాల్​ మాట్లాడే సౌకర్యం ఉంటుంది. అయితే, ఈ మెసెంజర్​ రూమ్స్​ కోసం ప్రత్యేకంగా ఫేస్​బుక్​ లాగ్​ఇన్​ అవ్వాల్సిన అవసరం లేకుండా.. వాట్సప్​ వెబ్ వెర్షన్​లో కనిపించేలా ఏర్పాటు చేస్తోంది ఎఫ్​బీ. దీంతో వాట్సప్​ నుంచే మెసెంజర్​ రూమ్స్​ ద్వారా 50 మందితో వీడియోకాల్​ మాట్లొడొచ్చు.

అధికారిక నివేదిక ప్రకారం.. ఈ మెసెంజర్​ రూమ్స్ ​షార్ట్​కట్​ జూన్​ 2 నుంచి వాట్సాప్​ వెబ్​లో కనిపిస్తుంది. ఇందులో వాట్సాప్​ గ్రూప్​ సృష్టించినట్టుగానే మెసెంజర్​ రూమ్​ క్రియేట్​ చేసుకుని వీడియోకాలింగ్​ కోసం స్నేహితులను ఇన్​వైట్​ చేయొచ్చు. అంతే కాదు, న్యూస్​ఫీడ్​, గ్రూప్స్​, ఈవెంట్​ పేజీలలో లింక్స్​ కూడా షేర్​ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:'ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.