సమాచార భద్రత కోసం మరో కొత్త సదుపాయం ప్రవేశపెడుతోంది వాట్సాప్. వేలి ముద్రలతో యాప్‌ను లాక్, అన్‌లాక్ చేసే ఫీచర్ తీసుకొస్తోంది.
ప్రయోగంలో భాగంగా బీటా వర్షన్ నెంబర్-2.19.3 అప్డేట్తో ఆండ్రాయిడ్ వినియోగదారులకు 'ఫింగర్‌ప్రింట్ లాక్' అందుబాటులోకి వచ్చింది. తెలియనివారు ఫోన్ చూసినపుడో లేదా ఫోన్ పోయినపుడో.. వాట్సాప్ సమాచార భద్రతకు భంగం వాటిల్లకుండా ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది. ఈ ఫీచర్‌ను 3 నెలల క్రితమే ఐఓఎస్ యూజర్ల కోసం ప్రవేశపెట్టింది వాట్సాప్.
ఐఓఎస్ యూజర్లకు తమ వాట్సాప్ అప్లికేషన్‌ను సురక్షితంగా ఉంచుకునేందుకు.. టచ్ ఐడీ లేదా ఫేస్ ఐడీ వంటి సాంకేతికత అందుబాటులో ఉంది. కానీ.. ఆండ్రాయిడ్ వినియోగదారులు మాత్రం ప్రస్తుతం ఫింగర్‌ప్రింట్ లాక్ సెన్సార్ ద్వారానే తమ సమాచారాన్ని భద్రపర్చుకోవాల్సి ఉంటుంది.
అతి త్వరలో ప్లే స్టోర్‌లో..
ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్‌తో వాట్సాప్ కొత్త వర్షన్ అతి త్వరలో గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవనుంది.
ఫింగర్‌ప్రింట్ లాక్ ఎనేబుల్ చేసుకునేందుకు అథెంటికేషన్ ఆప్షన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అందులో ఒకరికన్నా ఎక్కువ మంది ఫింగర్ప్రింట్లనూ నమోదు చేసుకోవచ్చు.
ఇదీ చూడండి: రెండు గుడ్లకు రూ.1700 బిల్‌పై మంత్రి ఆగ్రహం