ETV Bharat / business

Amazon: సీఈఓగా వైదొలిగినా.. చేతి నిండా పనే!

ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్.. అమెజాన్ సీఈఓ పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఏం చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అమెజాన్ మాత్రమే కాకుండా.. ఆయన మానసపుత్రికల్లా భావించే సంస్థలు మరికొన్ని ఉన్నాయి. ఇక నుంచి బెజోస్ వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టనున్నారు. అవేంటంటే..

jeff bezos
జెఫ్ బెజోస్
author img

By

Published : Jul 5, 2021, 10:40 PM IST

ఇ-కామర్స్‌ వ్యాపారానికి అమెజాన్‌ పేరిట పునాదులు వేసిన ఆ సంస్థ సీఈఓ, ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్ సోమవారం తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఆ బాధ్యతల్ని సన్నిహితుడు ఆండీ జాస్సీకి అప్పగించనున్నారు. అయితే, అమెజాన్‌ నుంచి మాత్రం ఆయన పూర్తిగా తప్పుకోవడం లేదు. ఎగ్జిక్యూటివ్‌ బోర్డుకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

1995లో అమెజాన్‌ పేరిట పుస్తకాలు అమ్మేందుకు ఓ చిన్న ఆన్‌లైన్ సంస్థను స్థాపించిన బెజోస్‌ దాన్ని అంచెలంచెలుగా పెంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్‌ సంస్థగా తీర్చిదిద్దారు. ఈ సక్సెస్‌ తర్వాత ఇతర వ్యాపారాలూ మొదలుపెట్టినప్పటికీ.. తొలి ప్రాధాన్యం మాత్రం అమెజాన్‌కే ఇస్తూ వచ్చారు. కంపెనీని ఇతర సేవల్లోకీ విస్తరించి.. నేటి తరానికి అమెజాన్‌ పేరెత్తనిదే రోజు గడవని స్థాయికి తీసుకెళ్లారు. మరి ఇన్నాళ్లూ ఇంత తీరిక లేకుండా గడిపిన బెజోస్‌ తర్వాత ఏం చేయనున్నారనే దానిపై అందరికీ ఆసక్తి పెరిగింది.

బ్లూ ఆరిజిన్ కీలకం

జెఫ్‌ బెజోస్‌ పూర్తిగా రిటైర్‌మెంట్‌ తీసుకోవడం లేదు. కేవలం అమెజాన్‌ రోజువారీ కార్యకలాపాల నుంచి మాత్రమే దూరంగా ఉండనున్నారు. అంతరిక్షపు అంచులను తాకడమే లక్ష్యంగా ప్రారంభించిన 'బ్లూ ఆరిజిన్‌', ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ 'వాషింగ్టన్ పోస్ట్'‌, వాతావరణ మార్పులపై పోరాడేందుకు ప్రారంభించిన 'బెజోస్ ఎర్త్ ఫండ్'‌, డే 1 ఫండ్‌ ప్రాజెక్టులపై బెజోస్‌ దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా బ్లూ ఆరిజిన్‌పై ఆయన అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. తన సోదరుడు మార్క్‌ బెజోస్‌తో కలిసి త్వరలో అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. దీంతో అంతరిక్ష పర్యాటకానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. దీనిపై ఇప్పటికే ఆయన బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టారు.

దాతృత్వ కార్యక్రమాలు

డే 1 ఫండ్‌ ద్వారా బెజోస్‌.. ఇల్లు లేని నిరాశ్రయులను ఆదుకోనున్నారు. అలాగే విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. మరోవైపు 10 బిలియన్ డాలర్లతో ప్రారంభించిన ఎర్త్‌ ఫండ్‌ ద్వారా వాతావరణ మార్పులపై పోరే లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందించారు. స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించే దిశగా అనేక ప్రాజెక్టులు చేపట్టనున్నారు. అలాగే 2013లో 250 మిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన వాషింగ్టన్‌ పోస్ట్‌ మీడియాను ప్రజలకు మరింత చేరువచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

అమెజాన్‌ ఇంత పెద్దదా..

అమెజాన్‌ నికర అమ్మకాలు 2020లో 38610 కోట్ల డాలర్ల (రూ.28.95 లక్షల కోట్ల)కు చేరాయి. దాదాపు మన దేశ బడ్జెట్‌కు దగ్గరగా.. ఎన్నో చిన్న దేశాల బడ్జెట్‌లన్నీ కలిపినా కూడా.. వాటికి అందనంత అధికంగా ఉండే మొత్తమిది. 1995లో బెజోస్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన అమెజాన్‌ విలువ ఇపుడు 1.7 లక్షల కోట్ల డాలర్లు అంటే.. రూ.127.5 లక్షల కోట్లకు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.