ETV Bharat / business

టిక్​టాక్​ కోసం మైక్రోసాఫ్ట్​తో వాల్​మార్ట్​ జట్టు!

టిక్​టాక్ అమెరికా కార్యకలాపాల కొనుగోలు రేసులో రిటైల్​ దిగ్గజం వాల్​మార్ట్​ చేరింది. మైక్రోసాఫ్ట్​తో కలిసి టిక్​టాక్​ను దక్కించుకునేందుకు సమాలోచలను జరుపుతున్నట్లు వాల్​మార్ట్​ ప్రకటించింది. టిక్​టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే.. వాల్​మార్ట్ ప్రకటన రావటం గమనార్హం.

Walmart joins Microsoft
టిక్​టాక్ కొనుగోలు రేసులో వాల్​మార్ట్
author img

By

Published : Aug 28, 2020, 1:04 PM IST

భారత్​లో నిషేధానికి గురై.. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఎదుర్కొంటున్న షార్ట్ వీడియో యాప్​ టిక్​టాక్ కొనుగోలు రేసులో మరో దిగ్గజ సంస్థ చేరింది. టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్‌తో కలిసి కొనుగోలు చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నామని ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్​ సంస్థ వాల్‌మార్ట్‌ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్‌, టిక్‌టాక్‌తో చేసుకోనున్న ఈ ఒప్పందం తమ అడ్వర్టైజింగ్‌ వ్యాపారాన్ని మరింత విస్తృతపరిచేందుకు దోహదం చేస్తుందని తెలిపింది.

ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌ వంటి దిగ్గజ సంస్థలు టిక్‌టాక్‌తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. వాల్‌మార్ట్‌ ప్రకటనపై ఇటు మైక్రోసాఫ్ట్‌ కానీ, టిక్‌టాక్ కానీ స్పందించలేదు. టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వాల్‌మార్ట్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి:టిక్​టాక్​ సీఈఓ పదవికి కెవిన్​ రాజీనామా.. కారణమిదే

ట్రంప్ హెచ్చరిక

జాతీయ భద్రతకు ముప్పు, అమెరికా వినియోగదారుల సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందంటూ అధ్యక్షుడు ట్రంప్‌ టిక్‌టాక్‌పై తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంటనే అమెరికాలో కార్యకలాపాల్ని విక్రయించాలని.. లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. అందుకు సెప్టెంబరు 15 గడువుగా విధించారు.

అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు..

మరోవైపు టిక్‌టాక్‌ కార్యకలాపాలపై భారత్, అమెరికా లేవనెత్తుతున్న అభ్యంతరాల్ని పరిష్కరించేందుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ఛైర్మన్‌ ఝాంగ్‌ యిమింగ్‌ ప్రకటించారు. వినియోగదారులు, భాగస్వాములు, ఉద్యోగుల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని యాప్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఇదీ చూడండి:ట్రంప్​కు వ్యతిరేకంగా కోర్టుకెక్కిన టిక్​టాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.