సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌కు.. టెలికాం సంస్థ వొడాఫోన్ షాకిచ్చింది. ఫేస్బుక్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'లిబ్రా' క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే పేపాల్, మాస్టార్కార్డ్, వీసా, మెర్గాడో పాగో, ఈబేలు తప్పుకోగా.. వీటి సరసన ఇప్పుడు వొడాఫోన్ చేరింది.
గత ఏడాది అక్టోబర్‌లో లిబ్రా అసోసియేషన్ ఏర్పడిన తర్వాత అందులో నుంచి బయటకు వచ్చిన తొలి సంస్థ వొడాఫోన్ కావడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్ నుంచి వొడాఫోన్ వైదొలిగిన విషయాన్ని లిబ్రా అసోసియేషన్ అధికారికంగా ధ్రువీకరించింది. అసోసియేషన్‌లో మార్పులు వచ్చినప్పటికీ ప్రాజెక్ట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఎందుకు తప్పుకుంటున్నాయి..?
క్రిప్టో కరెన్సీపై పలు నియంత్రణ సంస్థలు యూజర్ల డేటా భద్రత విషయంపై అభ్యంతరాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తొలుత లిబ్రా ప్రాజెక్ట్‌లో చేరిన కంపెనీలు వరుసగా తప్పుకుంటున్నాయి.
ఇదీ చూడండి:తాజ్‌మహల్ అందాలకు జెఫ్ బెజోస్ ఫిదా