వొడాఫోన్ ఐడియా (Vodafone idea) కస్టమర్లకు పెద్ద షాక్ తగిలింది. మొబైల్ ఛార్జీలను భారీగా పెంచుతున్నట్లు కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
మొబైల్ కాల్స్, డేటా ప్లాన్లపై దాదాపు 20 నుంచి 25 శాతం మేర పెంపు ఉండనున్నట్లు స్పష్టం చేసింది. నవంబర్ 25 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది.
28 రోజుల కనీస రీఛార్జ్ ప్లాన్ ధరను 25.31 శాతం పెంచింది. పాత ధర రూ. 79 ఉండగా.. ఇప్పుడు రూ. 99కి చేరింది.
అన్లిమిటెడ్ కేటగిరీ ప్లాన్లలో రేట్ల పెంపు 20-23 శాతం మధ్య ఉంది.
కొత్త ధరలివే..
ప్లాన్ | కాలపరిమితి | పాత ధర | కొత్త ధర |
1GB/ డే | 28 రోజులు | రూ. 219 | రూ. 269 |
1.5 GB/డే | 84 రోజులు | రూ. 599 | రూ. 719 |
1.5GB/డే | 365 రోజులు | రూ. 2399 | రూ. 2899 |
ఎయిర్టెల్ బాటలో..
ధరలను పెంచుతున్నట్లు ఎయిర్టెల్ (airtel recharge) ప్రకటించిన మరుసటి రోజే వొడాఫోన్- ఐడియా కూడా రేట్లు పెంచడం గమనార్హం.
ఎయిర్టెల్ కూడా తమ ప్లాన్లపై 20-25 శాతం మేర ధరలు పెంచింది. కొత్త రీఛార్జ్ ధరలు నవంబరు 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
వీటి బాటలోనే రిలయన్స్ జియో కూడా త్వరలో రేట్లు (Telecom Charges) పెంచనుందని తెలుస్తోంది.
ఇదీ చూడండి: ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ఛార్జీలు పెంపు.. కొత్త ధరలివే