వాహన బీమా ఉందని చిన్న చిన్న ప్రమాదాలకు క్లెయిమ్ చేసుకుంటున్నారా? క్లెయిమ్ రేటు పెరిగితే వచ్చే నష్టాలేంటో తెలుసుకోండి ఇప్పుడే.
సెటిల్మెంట్ మేలు
కొంత మంది చిన్న ప్రమాదాలకు కూడా క్లెయిమ్‌ను ఆశ్రయిస్తున్నారని, ఇది సరైంది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే చిన్న ప్రమాదాలకూ పోలీస్ కంప్లయింట్ ఇస్తే వారు జనరల్ డైరీలో నమోదు చేస్తారు. ఫలితంగా మీ బండిని ప్రమాదాల బారిన పడ్డ వాహనంగా గుర్తిస్తారు.
దీన్ని నివారించేందుకు వాహనం ప్రమాదానికి గురైనప్పుడు దాన్ని మరమ్మతుకు ఎంత ఖర్చవుతుందనే అంచనా వేయించుకోవాలి. నష్టభారం అధికంగా ఉందనుకుంటేనే క్లెయిమ్‌ను ఆశ్రయించాలన్నది నిపుణుల అభిప్రాయం. చిన్న ప్రమాదమైతే సెటిల్మెంట్ పద్ధతిని అనుసరిస్తే మంచిదంటున్నారు.
నో క్లెయిమ్ బోనస్ రాకపోవచ్చు
చిన్న ప్రమాదాలకు బీమా క్లెయిమ్ చేసుకోవడం ద్వారా నో క్లెయిమ్ బోనస్ రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బీమా పునరుద్ధరణ సమయంలో బీమాదారు ఇంతవరకు ఏమైనా క్లెయిమ్ చేయించుకున్నారా అని చూస్తాయి బీమా సంస్థలు. క్లెయిమ్ చేసుకోకపోతే బీమాదారు సురక్షితంగా వాహనాన్ని నడుపుతున్నారని గుర్తించి, పునరుద్ధరణ బోనస్ ఇస్తాయి.. దీన్నే నో క్లెయిమ్ బోనస్ అంటారు.
వాహనం అమ్మాలనుకుంటే...
ఏదైనా కారణంతో బండి అమ్మాలనుకుంటే... వాహనంతో పాటు దానిపై బీమానూ బదిలీ చేయాల్సి ఉంటుంది.
బీమాలో క్లెయిమ్ రేట్ ఎక్కువగా ఉంటే వాహనం ఎక్కువగా ప్రమాదాలకు గురైందని అర్థం. దీని ఆధారంగా అనుకున్నంత ధర మీ వాహనానికి రాకపోవచ్చు.
ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వాహనం నడవలేని స్థితిలో పడ్డప్పుడు గానీ.. బీమా క్లెయిమ్‌తో మాత్రమే రిపేరు చేయించుకునే స్థితిలో ఉంటే గానీ క్లెయిమ్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
ఇదీ చూడండి: మీ స్మార్ట్‌ఫోన్‌కు బీమా చేయిస్తున్నారా...?