ETV Bharat / state

సదర్‌ సంబురాలకు దున్నరాజులు సిద్ధం - ప్రత్యేక ఆకర్షణగా ఘోలు-2 ఛాంపియన్ బుల్

హైదరాబాద్‌లో మొదలైన సదర్‌ సంబురాలు - దున్నపోతులను ముస్తాబు చేసిన యాదవులు

Sadar Utsavalu in Hyderabad
Sadar Utsavalu in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2024, 9:07 AM IST

Updated : Nov 1, 2024, 10:57 AM IST

Sadar Utsavalu in Hyderabad : ఏటా దీపావళికి యాదవులు సదర్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా జరిపే ఆ వేడుకల్లో అలరించేందుకు భారీ దున్నరాజులు సిద్ధమయ్యాయి. హరియాణా నుంచి తీసుకొచ్చిన ఘోలు-2 ఛాంపియన్ బుల్‌తో శ్రీకృష్ణ, బాదో, షైరా, విదాయక్ వంటి దున్నలు సదర్ ఉత్సవాల్లో సందడి చేయనున్నాయి.

నారాయణగూడ వరకు : హైదరాబాద్‌లో ఏటా నిర్వహించే సదర్‌ ఉత్సవాలు నగరవాసులను అబ్బురపరుస్తాయి. సైదాబాద్‌లో స్థానికంగా నివాసముండే పంజాబీ కుటుంబీకుల నేతృత్వంలో ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతాయి. కీర్తి శేషులు పంజా కృష్ణ యాదవ్‌, లక్ష్మమ్మ యాదవ్‌ జ్ఞాపకార్థం సదర్ ఉత్సవాలు జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దశాబ్దాలుగా పాడి పరిశ్రమను, దున్నలను నమ్ముకొని పాల వ్యాపారం చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఉన్నట్లు వారు చెబుతున్నారు.

ఎన్టీఆర్ స్డేడియంలో ఘనంగా సదర్ ఉత్సవం - హాకీ స్టిక్స్​తో స్టెప్పులేసిన సీఎం రేవంత్‌

"మేము పోతులను ప్రత్యేకంగా చూసుకుంటాం. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చాం కాబట్టి వాటికి ఎలాంటి వాతావరణం కావాలో అలా ఏర్పాటు చేస్తాం. దానికి ప్రత్యేకంగా ఆహారం పెడతాం. రోజూ కసరత్తులు చేయిస్తాం. దీపావళి తర్వాత రెండో రోజు ముషీరాబాద్‌ నుంచి నారాయణగూడ వరకు సదర్ చేస్తాం. ఈసారి పోతులకు వచ్చిన అన్ని మెడల్స్‌ను ప్రదర్శించబోతున్నాం. ఈసారి మరింత ప్రత్యేకంగా నిర్వహించబోతున్నాం. మేము చేస్తున్న వ్యాపారానికి గౌరవంగా దీనిని నిర్వహిస్తున్నాం." - యాదవ సోదరులు

కృతజ్ఞతా భావంతో ఉత్సవాలు చేస్తాం : సదర్‌ ఉత్సవాలకు సిద్ధం చేసే దున్నలను ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటామని యాదవులు చెబుతున్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, క్రమేపీ బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తామన్నారు. సదర్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని యాదవులు తెలిపారు. సదర్ పండుగ కేవలం దున్నల ప్రదర్శన మాత్రమే కాదని, యాదవ కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్య ఆదరణగా చెబుతున్నారు. పాడి పరిశ్రమకు, పాల వ్యాపారానికి వారు ఇచ్చే గౌరవంగా పేర్కొన్నారు. సంవత్సరం పొడవునా తాము చేసే వ్యాపారానికి కృతజ్ఞతా భావంతో దీపావళి మరుసటి రోజు సదర్ పండుగ నిర్వహిస్తామని వారు చెబుతున్నారు.

నగరంలో సందడిగా సదర్​ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా రూ.35 కోట్ల దున్నరాజు

ఖైరతాబాద్​లో అట్టహాసంగా సదర్​ ఉత్సవాలు - ఆకట్టుకుంటున్న దున్నరాజుల విన్యాసాలు

Last Updated : Nov 1, 2024, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.