ETV Bharat / business

"తక్షణం చర్యలు తీసుకోండి"

విమాన తయారీ సంస్థ బోయింగ్​పై అమెరికా ఫెడరల్​ ఏవియేషన్​ అథారిటీ చర్యలకు సిద్ధమైంది. 'బోయింగ్​ 737 మ్యాక్స్​ 8' మోడల్​ విమానాలకు అవసరమైన అప్​డేట్​లు చేయాలని పేర్కొంది. ఏప్రిల్​లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది.

author img

By

Published : Mar 12, 2019, 2:51 PM IST

బోయింగ్

బోయింగ్​ సంస్థ తమ విమానాల్లో లోపాలను సరిదిద్దుకోవాలని అమెరికా ఫెడరల్​ ఏవియేషన్​ అథారిటీ(ఎఫ్​ఏఏ) సూచించింది. ఆ సంస్థకు చెందిన 737 మ్యాక్స్​ 8 మోడల్​ విమానాల్లో అవసరమైన సాఫ్ట్​వేర్​ సహా ఇతర వ్యవస్థలను అప్​డేట్​ చేయాలని తెలిపింది.

గత ఐదు నెలల్లో ఈ మోడల్​కు చెందిన రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. ఎఫ్​ఏఏ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్​లోపు చర్యలు చేపట్టాలని ఎఫ్​ఏఏ పేర్కొంది.

ఇథియోపియన్​ ఎయిర్​లైన్స్​కి చెందిన ఈటీ302 విమానం ఆదివారం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 157 మంది మృతి చెందారు. గతేడాది అక్టోబరు​ చివర్లో ఇండోనేషియాకు చెందిన లయన్​ ఎయిర్​లైన్స్​ విమానం కుప్పకూలి 189 మంది దుర్మరణం చెందారు.

ఇథియోపియన్​ విమాన ప్రమాదానికి కారణమైన పూర్తి వివరాలు ఇప్పటి వరకూ తెలియరాలేదు. అయితే విమానప్రమాదంలో కీలక ఆధారమైన బ్లాక్​ బాక్స్​ను మాత్రం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బ్లాక్​ బాక్స్ సమాచారం ద్వారాప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునే అవకాశం ఉంది.

Intro:Body:

q

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.