సంక్షిప్త సందేశాల దిగ్గజం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఒకేసారి వేర్వేరు డివైజ్‌లలో లాగిన్ అవ్వగలిగే ఫీచర్‌ని మరికొన్ని వారాల్లో వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం.
చాలా రోజులుగా యూజర్స్ నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా ఈ సరికొత్త ఫీచర్‌ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి దాకా రిజిస్టర్ చేసుకున్న డివైజ్‌లో మాత్రమే వాట్సాప్ లాగిన్ కాగలం. వేరొక డివైజ్‌లో లాగిన్ అవ్వాలనుకుంటే గతంలో రిజిస్టర్ అయిన డివైజ్ నుంచి ఆటోమేటిక్‌గా లాగ్‌అవుట్ అవుతుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి ఒక డివైజ్‌లో లాగ్‌అవుట్ అవ్వకుండానే.. మరో డివైజ్‌లో వాట్సాప్ వినియోగించుకోవచ్చు.
మరిన్ని ఫీచర్లపై వాట్సాప్ కసరత్తు..
త్వరలోనే డార్క్‌మోడ్ ఫీచర్‌ని వాట్సాప్ తీసుకురానుంది. ఇప్పటి వరకు ఐఫోన్‌లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్‌ను ఇకముందు ఐపాడ్‌లలో వినియోగించుకునే సదుపాయాన్ని వాట్సాప్ కల్పించనుంది.
యూపీఐ ఆధారంగా పనిచేసే వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్‌ను త్వరలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు వాట్సాప్ గతంలోనే ప్రకటించింది. వాట్సాప్ ఈ చెల్లింపుల విధానానికి ఆర్‌బీఐ నుంచి అనుమతిపొందవలసి ఉంది.
గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొత్త ఫీచర్‌ని వాట్సాప్ తేనుందని టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. బ్లాక్‌లిస్ట్ సహాయంతో గ్రూప్‌లో చేరమని ఇన్విటేషన్ రిక్వెస్ట్ పంపే వారిని బ్లాక్ చేయవచ్చు. అయితే ముందుగా ఈ ఫీచర్‌ని ఐఫోన్ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులోకి తేనునుంది వాట్సాప్.
ఇదీ చూడండి: అక్టోబర్‌లో రికార్డు స్థాయికి.. యూపీఐ లావాదేవీలు