ఎలాన్ మస్క్.. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓగా వ్వవహరిస్తున్న ఎలాన్ మస్క్ విచిత్ర ప్రకటనలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన ట్వీట్లతో కొన్ని సార్లు వివాదాలకు కేంద్ర బిందవు అవుతుంటారు. ఇటీవల టెస్లా షేర్ల విలువ మరీ ఎక్కువగా ఉందంటూ మస్క్ చేసిన ఒక్క ట్వీట్‌తో... ఆ సంస్థ షేర్లు 10 శాతానికిపైగా నష్టపోయాయి. దీంతో ఆయన భారీగా నష్టపోయాడు.
ఆదే రోజు వరుస ట్వీట్లతో తన గర్ల్ ఫ్రెండ్ 'గ్రిమ్స్' మగబిడ్డకు జన్మనిచ్చినట్లు కూడా తెలిపారు. తాజాగా ఆ బిడ్డతో దిగిన ఫొటో ఒకటి షేర్ చేశారు మస్క్. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది లేనప్పటికీ.. తన కుమారుడికి పెట్టిన పేరుతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎందుకంటే తన కొడుక్కి 'X Æ A-12 Musk' అనే పేరు పెట్టినట్లు ట్వీట్లో పేర్కొన్నారు.
-
X Æ A-12 Musk
— Elon Musk (@elonmusk) May 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">X Æ A-12 Musk
— Elon Musk (@elonmusk) May 5, 2020X Æ A-12 Musk
— Elon Musk (@elonmusk) May 5, 2020
ఇటీవల విచిత్రంగా పేర్లు పెట్టడం ట్రెండ్‌గా నడుస్తోందని.. అయితే ఈ పేరు మరీ వింతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ పేరు పలకడం ఎలా? అంటూ మరికొందరు మస్క్‌ను ప్రశ్నిస్తూ.. సరదా కామెంట్లు చేస్తున్నారు.
మస్క్‌ను విపరీతంగా అభిమానించే కొందరేమో... ఈ పేరు వెనక ఏదో పరమార్థముందని.. అదేంటో తెలుసుకోవాలని తెగ కష్టపడుతున్నారు.
అయితే వీటన్నింటికి మస్క్ గర్ల్ ఫ్రెండ్ 'గ్రిమ్స్' (కెనడా సింగర్) చెక్ పెట్టారు. ఆ పేరు వెనక ఉన్న అర్థమేంటో ట్విట్టర్లో వివరణ ఇచ్చారు.
-
•X, the unknown variable ⚔️
— ꧁ ༒ Gℜiꪔ⃕es ༒꧂ 🍓🐉🎀 小仙女 (@Grimezsz) May 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
•Æ, my elven spelling of Ai (love &/or Artificial intelligence)
•A-12 = precursor to SR-17 (our favorite aircraft). No weapons, no defenses, just speed. Great in battle, but non-violent 🤍
+
(A=Archangel, my favorite song)
(⚔️🐁 metal rat)
">•X, the unknown variable ⚔️
— ꧁ ༒ Gℜiꪔ⃕es ༒꧂ 🍓🐉🎀 小仙女 (@Grimezsz) May 6, 2020
•Æ, my elven spelling of Ai (love &/or Artificial intelligence)
•A-12 = precursor to SR-17 (our favorite aircraft). No weapons, no defenses, just speed. Great in battle, but non-violent 🤍
+
(A=Archangel, my favorite song)
(⚔️🐁 metal rat)•X, the unknown variable ⚔️
— ꧁ ༒ Gℜiꪔ⃕es ༒꧂ 🍓🐉🎀 小仙女 (@Grimezsz) May 6, 2020
•Æ, my elven spelling of Ai (love &/or Artificial intelligence)
•A-12 = precursor to SR-17 (our favorite aircraft). No weapons, no defenses, just speed. Great in battle, but non-violent 🤍
+
(A=Archangel, my favorite song)
(⚔️🐁 metal rat)
అయితే ఈ ట్వీట్‌తో కూడా చాలా మందికి.. ఆ పేరులో ఉన్న రహస్యమేంటో అర్థం కాలేదని కామెంట్లు చేస్తుండగా.. కొందరు మాత్రం వినూత్నంగా ఉందని అంటున్నారు.
ఇదీ చూడండి:వాటి కోసం ఈ-కామర్స్ సైట్స్‌లో తెగ వెతికేస్తున్నారట!