ETV Bharat / business

కోహ్లీ సేనపై టీవీ వ్యాపారుల​ కోటి ఆశలు - భారత్ x పాక్

ప్రపంచకప్​లో ఆటతీరుతో ఆకర్షిస్తోన్న భారత్ జట్టుపై క్రికెట్ అభిమానులే కాకుండా... టీవీల వ్యాపారులూ వ్యాపారులూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ట్రోఫీ ముగిసే నాటికి కనీసం 20శాతం టీవీల అమ్మకాలు పెంచుకోవాలని భావిస్తున్నారు.

భారత క్రికెట్ జట్టుపై టీవీ వ్యాపారుల ఆశలు
author img

By

Published : Jun 18, 2019, 4:48 PM IST

ప్రస్తుతం ఇంగ్లాండ్​లో జరుగుతున్న ప్రపంచకప్​లో భారత జట్టు ఆటతీరు ఆకట్టుకుంటోంది. జట్టుపై అభిమానులే కాకుండా... టీవీల తయారీదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచ కప్ ముగిసే నాటికి కనీసం 20 శాతం అమ్మకాలు పెంచుకోవాలని భావిస్తున్నారు.

"ప్రపంచ కప్​లో భాగంగా భారత్-పాక్​ మధ్య గత ఆదివారం మ్యాచ్ జరిగింది. మ్యాచ్​కు వారం ముందు టీవీల అమ్మకాలు భారీగా వృద్ధి చెందాయి. ఇందుకు కచ్చితంగా ఆ మ్యాచ్​కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. భారత్ ఆటతీరు ఇక ముందు కూడా ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం. దీని కారణంగా దేశంలో టీవీలకు గిరాకీ పెరుగుతుంది."
---సునీల్ నాయర్​, సోనీ ఇండియా మేనేజింగ్​ డైరెక్టర్​

ప్రస్తుతం తాము 55 అంగుళాలు, అంతకన్నా పెద్ద టీవీలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు సునీల్​​. ప్రపంచకప్ ముగిసేనాటికి (జూలై నాటికి) మూడంకెల వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారాయన.

2019లో టీవీ మార్కెట్ కాస్త మందగించింది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల కారణంగా జనవరి-మార్చి మధ్య అమ్మకాలు మందకొడిగా సాగాయని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం, సాధారణ వర్షపాతం నమోదవుతుందనే అంచనాలతో టీవీల అమ్మకాలు కాస్త పుంజుకున్నట్లు వెల్లడించాయి.

ఇదీ చూడండి: బాస్కెట్​బాల్​ జట్టు విజయోత్సవ ర్యాలీలో అపశ్రుతి

Intro:Body:

df

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.