ETV Bharat / business

మైక్రోసాఫ్ట్​ను కాదని ఒరాకిల్​కు టిక్​టాక్ విక్రయం!

టెక్​ సంస్థ ఒరాకిల్​కు టిక్​టాక్ తమ అమెరికా కార్యకలాపాలు విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రేసులో మొదటి నుంచి ముందువరుసలో ఉన్న మైక్రోసాఫ్ట్​ను కాదని టిక్​టాక్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

author img

By

Published : Sep 14, 2020, 8:51 AM IST

oracle will take over tiktok us
ఒరాకిల్ చేతికి టిక్​టాక్ అమెరికా వ్యాపారాలు

టిక్​టాక్ అమెరికా కార్యకలాపాల విక్రయానికి టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​కు బదులు ఒరాకిల్​ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాల ద్వారా ఈ విషయం తెలిసింది. టిక్​టాక్ కొనుగోలు రేసులో మైక్రోసాఫ్ట్ మొదటి నుంచి ప్రధానంగా ఉంది. అయితే తమ బిడ్​ను టిక్​టాక్​ తిరస్కరించినట్లు మైక్రోసాఫ్ట్ ఆదివారం అధికారికంగా ప్రకటించడం గమనార్హం.

ఆ తర్వాత తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ విషయంపై.. ఇటు ఒరాకిల్ గానీ, అటు టిక్​టాక్ ​గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

గతంలో టిక్​టాక్​ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్​తో కలిసి ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించిన వాల్​మార్ట్​.. ఇంకా రేసులో ఉందా? అనే విషయంపైనా స్పష్టతలేదు.

టిక్​టాక్ విక్రయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే టిక్​టాక్- ఒరాకిల్ డీల్ కుదుర్చుకోనున్నట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.

ఇదీ చూడండి:టిక్​టాక్ డెడ్​లైన్ పొడగించే ప్రసక్తే లేదు: ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.