ETV Bharat / business

టెస్లాకు భారీ లాభాలు.. కొత్త ఫ్యాక్టరీలకు రంగం సిద్ధం!

author img

By

Published : Jan 27, 2022, 11:48 AM IST

Tesla Profit 2021: టెస్లా సంస్థ 2021 ఏడాదిలో భారీ లాభాలను సంపాదించింది. 5.5 బిలియన్ డాలర్లను వెనకేసుకుంది. అయితే, చిప్ కొరత కారణంగా ఈ ఏడాది కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడం లేదని తెలిపింది. కొత్తగా ఫ్యాక్టరీలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

TESLA PROFITS
TESLA PROFITS

Tesla posts record profit: ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా.. నాలుగో త్రైమాసికంలో భారీ లాభాన్ని వెనకేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆటో పరిశ్రమపై చిప్​ కొరత తీవ్ర ప్రభావం చూపినప్పటికీ.. టెస్లా మాత్రం పెద్ద సంఖ్యలో విద్యుత్ వాహనాలను విక్రయించింది. ఫలితంగా 2021 ఏడాదిలో 5.5 బిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని సంపాదించింది. నాలుగో త్రైమాసికంలోనే 2.32 బిలియన్ డాలర్లను వెనకేసుకుంది. 2020లో సంస్థ 3.47 బిలియన్ డాలర్ల లాభాన్ని సంపాదించింది.

Tesla Profit 2021:

2021 ఏడాదిలో మొత్తం 9,36,000 వాహనాలను టెస్లా విక్రయించింది. ఇది 2020తో పోలిస్తే రెట్టింపు. 2021 నాలుగో త్రైమాసికంలోనే సంస్థ 3,08,600 వాహనాలను అమ్మింది.

కొత్త మోడళ్లు లేనట్టే..

Tesla Yearly profit: వార్షిక లాభంలో గణనీయ వృద్ధి కారణంగా టెస్లా లాభాదాయ సంస్థగా మారిందని కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు. గతేడాది కంటే 2022లో 50 శాతం అధికంగా వాహనాలను ఉత్పత్తి చేస్తామని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే, చిప్​ల కొరత కారణంగా ఈ ఏడాది కొత్త మోడల్ కార్లను అందుబాటులోకి తీసుకురావడం లేదని వెల్లడించారు.

"అదనపు ఫ్యాక్టరీలను నిర్మించేందుకు టెస్లా ప్రయత్నిస్తోంది. ఎక్కడ నెలకొల్పుతామనే విషయాన్ని ఈ ఏడాది చివర్లో ప్రకటిస్తాం. ఇప్పటివరకైతే మన వద్ద కావాల్సినన్ని(టెస్లా మోడళ్లు) ఉన్నాయి. కొత్త మోడళ్లపై దృష్టిసారిస్తే.. వనరులన్నీ దానికే వెచ్చించాల్సి వస్తుంది. దీని ప్రభావం ప్రస్తుత మోడళ్ల తయారీ, డెలివరీపై పడుతుంది. 25 వేల డాలర్లలో చిన్న ఎలక్ట్రిక్ కారును తయారు చేయాలన్న ప్రతిపాదనను సైతం ప్రస్తుతం పక్కనబెట్టాం. అయితే, భవిష్యత్​లో తప్పకుండా దీనిపై పనిచేస్తాం."

-ఎలాన్ మస్క్, సీఈఓ, టెస్లా మోటార్స్

మరోవైపు, టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్​వేర్​ను పరీక్షిస్తున్నట్లు సంస్థ తెలిపింది. గతేడాది 60 వేల వాహనాల యజమానులు దీన్ని పరీక్షించారని పేర్కొంది. ఈ సాఫ్ట్​వేర్ ధర 12 వేల డాలర్లు కాగా.. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కంపెనీ లాభం మరింత పెరుగుతుందని టెస్లా భావిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: Flying car: ఎగిరే కారు వచ్చేసింది.. రెండే నిమిషాల్లో ఆకాశంలోకి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.