దేశంలోనే అతిపెద్ద ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ ఈ ఏడాది తొలిత్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. ఈ త్రైమాసికానికి రూ.8,131 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభంలో 10.8శాతం వృద్ధి నమోదయింది. ఆదాయం 11.4శాతం పెరిగి రూ.38,172కు చేరింది.
గతేడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 32.2శాతంగా ఉన్న డిజిటల్ రెవిన్యూ ఈ ఏడాది 42.1శాాతానికి పెరిగింది. గత ఐదేళ్లలోనే అత్యధికంగా ఈ ఒక్క ఏడాదిలోనే 12,356 మంది నూతన ఉద్యోగులను చేర్చుకుంది ముంబయికి చెందిన టెక్ దిగ్గజ సంస్థ. ప్రస్తుతం టీసీఎస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,36,641కి చేరింది.
టీసీఎస్ ఒక్కో షేరు రూ.21.67 లాభం ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే 13శాతం వృద్ధి చెందింది. 2018-19 టీసీఎస్ తొలిత్రైమాసిక నికర లాభం రూ.7,340కోట్లు.
2018-19 టీసీస్ తొలిత్రైమాసిక ఆదాయం రూ.34,261కోట్లు.
ఇదీ చూడండి: ఒక్కసారిగా దిగొచ్చిన బంగారం ధర