ETV Bharat / business

టాటాల చేతికే ఎయిర్​ ఇండియా- కేంద్రం ప్రకటన - ఎయిర్​ ఇండియా టాటాల సొంతం

Airindia, Tata
ఎయిర్​ఇండియా, టాటా
author img

By

Published : Oct 8, 2021, 4:14 PM IST

Updated : Oct 8, 2021, 5:24 PM IST

16:12 October 08

టాటాల చేతికే ఎయిర్​ ఇండియా- కేంద్రం ప్రకటన

నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్ధ ఎయిర్‌ ఇండియాను.. టాటా సన్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా వెల్లడించింది. ఈ సంస్థను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. టాటా సన్స్‌ దాఖలు చేసిన బిడ్‌ అన్నింటికంటే ఆకర్షణీయంగా ఉందని కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఎం) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే తెలిపారు.

ఈ నెల ఆరంభంలోనే ఎయిర్​ఇండియాను టాటా సన్స్​ దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం ఆ వార్తలు అవాస్తవమని ఖండించింది. చివరకు ఆ అంచనాలన్నీ నిజమయ్యాయి.

ఎయిర్​ఇండియా సొంత గూటికి చేరడంపై టాటా సన్స్​ గౌరవ ఛైర్మన్​ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. 'వెల్​కం బ్యాక్​ ఎయిర్​ఇండియా' అనే క్యాప్షన్​తో.. జేఆర్​డీ టాటా, పాత ఎయిర్​ఇండియా వద్ద దిగిన ఓ ఫొటోతో కూడిన ఓ డాక్యుమెంట్​ను ట్విట్టర్​లో షేర్ చేశారు.

Last Updated : Oct 8, 2021, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.