ETV Bharat / business

టాటా సన్స్ పగ్గాలు మరోసారి ఆయనకే - బిజినెస్ వార్తలు టాటా సన్స్

Tata Sons chairman: టాటా సన్స్ ఛైర్మన్​గా ఎన్ చంద్రశేఖరన్​ను కొనసాగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటన జారీ చేసింది. ఫిబ్రవరి 20తో ఆయన పదవీ కాలం ముగియనుండగా.. ఆ తర్వాత కూడా ఆయన ఈ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది. 2017.. టాటా సన్స్‌ నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో చంద్ర పగ్గాలు చేపట్టారు. అంతకుముందు ఛైర్మన్‌గా ఉన్న సైరస్‌ మిస్త్రీకి బోర్డు ఉద్వాసన పలికిన నేపథ్యంలో, చంద్ర నియామకం చోటుచేసుకుంది.

TATA SONS CHAIR
టాటా సన్స్ ఛైర్మన్
author img

By

Published : Feb 11, 2022, 2:59 PM IST

Updated : Feb 12, 2022, 6:29 AM IST

Tata Sons chairman: టాటా సన్స్‌ ఛైర్మన్‌ పగ్గాలు మళ్లీ ఎన్‌.చంద్రశేఖరన్‌కే దక్కాయి. టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీకి అధిపతిగా రెండో సారి, అయిదేళ్ల కాలానికి ఆయన్ను పునర్నియమిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్‌లో మెజారిటీ వాటాదార్లయిన టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా ఈ నియామకానికి మద్దతు పలికారు. శుక్రవారం జరిగిన టాటా సన్స్‌ బోర్డు సమావేశానికి టాటా ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు. గత అయిదేళ్లలో చంద్రశేఖరన్‌ పనితీరును సమీక్షించడం సహా వచ్చే అయిదేళ్లకు తిరిగి నియమించే అంశమే ఈ సమావేశ అజెండా. 'చంద్రశేఖరన్‌ నాయకత్వంలో టాటా గ్రూప్‌ పనితీరుపై టాటా సంతృప్తి వ్యక్తం చేశారు. మరో అయిదేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌ను పునర్నియమించడానికి బోర్డు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది' అని కంపెనీ వివరించింది.

సంక్షోభ సమయంలో నాయకత్వం వహించి..

2017.. టాటా సన్స్‌ నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో చంద్ర పగ్గాలు చేపట్టారు. అంతకుముందు ఛైర్మన్‌గా ఉన్న సైరస్‌ మిస్త్రీకి బోర్డు ఉద్వాసన పలికిన నేపథ్యంలో, చంద్ర నియామకం చోటుచేసుకుంది. అప్పటి వరకు టాటా గ్రూప్‌నకు భారీ ఆదాయాన్ని ఆర్జించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)కు చంద్ర బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. టాటా సన్స్‌ బోర్డులో 2016 అక్టోబరులో చేరిన చంద్ర, 2017 జనవరిలో ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత నెలలో బాధ్యతలు స్వీకరించారు. టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, టాటా పవర్‌, టీసీఎస్‌ వంటి కంపెనీల బోర్డుల్లోనూ సభ్యుడిగా చేరారు. చంద్ర పదవీ కాలంలో చాలా వరకు మిస్త్రీతో న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది.

మూడింతలైన గ్రూప్‌ మార్కెట్‌ విలువ

154 చరిత్ర గల టాటా గ్రూప్‌ చంద్ర నేతృత్వంలోనే ఆల్‌-ఇన్‌-వన్‌ ఇ-కామర్స్‌ సూపర్‌ యాప్‌ను తీసుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకుంది. గత అయిదేళ్లలో గ్రూప్‌ మార్కెట్‌ విలువ మూడింతలు పెరిగింది కూడా.

  • నష్టాలను తగ్గించుకునేందుకు టాటా టెలీ సర్వీసెస్‌ మొబైల్‌ వ్యాపారాన్ని భారతీ ఎయిర్‌టెల్‌కు విక్రయించారు.
  • 2018లో దివాలా ప్రక్రియలో ఉన్న భూషణ్‌ స్టీల్‌ను రూ.35,200 కోట్లతో టాటా స్టీల్‌ సొంతం చేసుకుంది. అయితే తన ఐరోపా వ్యాపారాన్ని తైసన్‌క్రప్‌కు విక్రయించలేకపోయారు.
  • టాటా ఆధ్వర్యంలో దేశీయంగా 3 విమాన కంపెనీలు విస్తారా, ఎయిరేషియా ఇండియా, ఎయిరిండియా ఉన్నాయి.
  • గతేడాది నుంచి డిజిటల్‌ డొమైన్‌లో కొనుగోళ్లను మొదలుపెట్టిన చంద్ర.. ఉప్పు నుంచి విమాన టికెట్ల వరకు గ్రూప్‌నకు చెందిన అన్ని ఉత్పత్తులను నేరుగా వినియోగదార్లకు విక్రయించేందుకు ఒక సూపర్‌ను యాప్‌ను సిద్ధం చేయిస్తున్నారు.
  • 2021 మేలో టాటాసన్స్‌ రూ.9,500 కోట్లతో బిగ్‌బాస్కెట్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌, రిలయన్స్‌ రిటైల్‌లతో ప్రత్యక్ష పోటీకి దిగింది.

నాకు దక్కిన గౌరవం

'గత అయిదేళ్లుగా టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. మరో అయిదేళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వహించబోతున్నందుకు సంతోషంగా ఉంది' అని అందరూ 'చంద్ర'గా పిలిచే చంద్రశేఖరన్‌(58) పేర్కొన్నారు.

రూ.23.8 లక్షల కోట్లకు చేర్చారు

చంద్ర సారథ్యంలో టాటా గ్రూప్‌లోని అన్ని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ 199 శాతం(మూడింతలు) దూసుకెళ్లింది. 2017 ఫిబ్రవరిలో చంద్ర పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా నిఫ్టీ-50 97 శాతం రాణించింది. ఈ వ్యవధిలో టాటా కంపెనీల మార్కెట్‌ విలువ రూ.8 లక్షల కోట్ల నుంచి రూ.23.8 లక్షల కోట్లకు చేరినట్లు ఏస్‌ ఈక్విటీ అంచనా వేసింది. ఇందుకు ప్రధాన కారణం టాటా టెలి సర్వీసెస్‌, టాటా ఎలెక్సీ, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, టైటన్‌ కంపెనీ, టాటా స్టీల్‌, టీసీఎస్‌లలో వచ్చిన ర్యాలీనే. గత అయిదేళ్ల లో టాటా ఎలెక్సీ మార్కెట్‌ విలువ 976 శాతం పెరిగి రూ.47,352 కోట్లకు చేరింది. గ్రూప్‌ మార్కెట్‌ విలువలో 58 శాతం వాటా ఉన్న టీసీఎస్‌ మార్కెట్‌ విలువ 200 శాతం వృద్ధితో రూ.13.95 లక్షల కోట్లకు చేరుకుంది. టాటా స్టీల్‌ 286% వృద్ధితో రూ.1.52 లక్షల కోట్లకు పెరిగింది.

TATA SONS CHAIR
కంపెనీల వాటా

నిరుత్సాహకర విషయం ఇదే: టాటా మోటార్స్‌ షేరు మాత్రం 20 శాతమే పెరిగింది. రాబోయే రోజుల్లో రుణ రహిత సంస్థగా మారనున్నట్లు ప్రకటించిన అనంతరమే (గత 18 నెలలుగా) ఈ షేరు పెరిగింది. టాటా మోటార్స్‌ డీవీఆర్‌ 20%; టీఆర్‌ఎఫ్‌ షేరు 36 శాతం చొప్పున నష్టాల పాలుకావడం గమనార్హం.

ఇదీ చదవండి: ఎయిర్​టెల్​ సేవలకు బ్రేక్- సోషల్​ మీడియాలో ఫిర్యాదులు

Last Updated : Feb 12, 2022, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.