ETV Bharat / business

ఆక్సిజన్​ కొరతకు టాటా, రిలయన్స్​ చెక్​! - మెడికల్ ఆక్సిజన్ కొరత తీర్చేందుకు టాటా గ్రూప్ చర్యలు

కరోనా వైరస్ రెండో దశ.. దేశాన్ని కుదిపేస్తోంది. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో ఆక్సిజన్​ కొరత కూడా వేధిస్తోంది. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు టాటా గ్రూప్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​ వంటి దిగ్గజ సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఆక్సిజన్​ సరఫరాకు క్రయోజనిక్​ కంటైనర్లను దిగుమతి చేసుకుంటున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. రిలయన్స్​.. ఆక్సిజన్​ ఉత్పత్తిని భారీగా పెంచినట్లు సమాచారం.

Medical oxygen
మెడికల్ ఆక్సిజన్​
author img

By

Published : Apr 21, 2021, 12:06 PM IST

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్​ కొరత లేకుండా టాటా గ్రూప్​ చర్యలు వేగవంతం చేసింది. అవసరమైన చోటుకు లిక్విడ్ ఆక్సిజన్​ సరఫరా చేసేందుకు వీలుగా.. 24 క్రయోజనిక్ కంటైనర్లను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది.

కొవిడ్ 19ను ఎదుర్కొనే సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు తమ సంస్థ అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని స్పష్టం చేసింది టాటా గ్రూప్​. ఛార్టెడ్ ఫ్లైట్ల ద్వారా ఈ క్రయోజనిక్​ కంటైనర్లను దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొంది.

రోజుకు 700 టన్నుల ఆక్సిజన్​ ఉత్పత్తి..

ఆక్సిజన్​ కొరతను తీర్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్​ కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. జామ్​నగర్​లోని రిఫైనరీ నుంచి రోజుకు 700 టన్నులకు పైగా.. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్​ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఇక్కడ రోజుకు 100 టన్నుల ఆక్సిజన్​ను మాత్రమే ఉత్పత్తి చేసింది రిలయన్స్. చాలా ప్రాంతాల్లో ప్రాణవాయువు అవసరం పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచినట్లు సమాచారం.

ఉత్పత్తి పెంపు ద్వారా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్​లలో రోజుకు 70,000 మంది రోగులకు ఆక్సిజన్​ అందించే వీలు కలగనుంది.

ఇదీ చదవండి:'రెండు నెలల్లో 4 రెట్లు పెరిగిన ఆక్సిజన్​ డిమాండ్​'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.