ETV Bharat / business

కొద్ది నెలల్లోనే టాటా చేతికి ఎయిర్ ​ఇండియా! - ఎయిర్​ఇండియా టాటా ఒప్పందం

ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఎయిర్​ ఇండియా... టాటా గ్రూప్ పరిధిలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 31లోపు టాటా మినహా.. ఏ ఇతర సంస్థ ఎయిర్​ ఇండియా కొనుగోలుకు బిడ్లు సమర్పించకపోతే జరిగేది అదేనని విశ్లేషణలు వస్తున్నాయి. పోటీ లేకుంటే టాటాకు ఎయిర్​ ఇండియా బదిలీ లాంఛనం కానుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

tata sons air india talks
ఎయిర్​ ఇండియా టాటాలకే
author img

By

Published : Aug 16, 2020, 7:22 PM IST

అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభం నుంచే టాటా గ్రూప్​ పరిధిలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

టాటాకే ఎందుకు?

ఎయిర్​ ఇండియా కొనుగోలుకు బిడ్లు సమర్పించేందుకు ఆగస్టు 31తో గడువు ముగియనుంది. మరోసారి గడువు పెంచే యోచన లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఎయిర్​ ఇండియా కొనుగోలుకు మొగ్గు చూపుతున్న ఏకైక సంస్థ టాటా గ్రూప్ మాత్రమే. దీనితో టాటా గ్రూప్​ బిడ్​ సమర్పిస్తే (గడువు లోపు ఇతర సంస్థల నుంచి పోటీ రాకపోతే) ఎయిర్​ ఇండియా పగ్గాలు అప్పగించడం లాంఛనం కానుంది.

ఇప్పటికే కరోనా కారణంగా విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి సమయాల్లో ఏ సంస్థ కూడా ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. దీనితో టాటాకు ఎయిర్​ ఇండియా కొనుగోలు విషయంలో పోటీ ఉండే అవకాశం తక్కువే.

టాటా గ్రూప్​ బిడ్​ను ప్రభుత్వం ఆమోదిస్తే.. 90 రోజుల వ్యవధిలోపు ఎయిర్​ ఇండియాను టాటాకు బదిలీ చేసే అవకాశం ఉంది. నవంబర్​ 30 లేదా డిసెంబర్ 31తో బదిలీ ప్రక్రియ పూర్తవ్వచ్చని అంచనా. అదే జరిగితే 2021 జనవరి 1 నుంచి ఎయిర్​ఇండియా కార్యకలాపాలు టాటా గ్రూప్ నిర్వహించొచ్చు.

​విమాన రంగంలో టాటా గ్రూప్​..

టాటా గ్రూప్​ ఇప్పటికే విమానయాన వ్యాపారాల్లో ఉంది. విస్తారా ఎయిర్​లైన్స్​ టాటాకు చెందినదే. ఎయిర్ ​ఏషియా ఇండియా వ్యాపారాల్లోనూ టాటాకు పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ​ఇండియానూ టాటా సామ్రాజ్యంలోకి తీసుకోవాలని భావిస్తోంది. 1948 ముందు వరకు ఎయిర్​ ఇండియా కూడా టాటా గ్రూప్​ పరిధిలోనే ఉండటం గమనార్హం.

ఎయిర్​ ఇండియా అప్పులు..

ఎయిర్​ ఇండియాకు ప్రస్తుతం రూ.52 వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. ఎయిర్​ ఇండియాను కొనుగోలు చేసిన సంస్థ దాదాపు 23 వేల కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన అప్పులు ఎస్‌పీవీకి బదిలీ చేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. భారీ అప్పుల కారణంగానే ఎయిర్​ఇండియాలో 100 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి 2018లో ఎయిర్​ ఇండియా వాటా విక్రయానికి ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు.

ఇదీ చూడండి:టెలిగ్రామ్​లో వీడియో కాల్​ సహా అదిరే కొత్త ఫీచర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.