ETV Bharat / business

వాట్సాప్​ అప్​డేట్​ కథేంటి..? ప్రత్యామ్నాయాలివే.. - తాజా వార్తలు సిగ్నల్

ఈ 21వ శతాబ్దంలో డిజిటలైజేషన్​ ఎంత వేగంగా పరుగులు తీస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం డేటాకు(సమాచారం) ఉన్న విలువ అంతా ఇంతా కాదు. ఇటీవల వాట్సాప్​ తీసుకువచ్చిన కొత్త అప్​డేట్​పై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేయడానికి ఇదే కారణం. తమ సమాచార గోప్యతపై వారికి అనుమానాలు కలగడం వాట్సాప్​ కొంపముంచింది.

Tale of WhatsApp
వాట్సాప్​ అప్​డేట్​ కథేంటి..? ప్రత్యామ్నాయాలివే..
author img

By

Published : Jan 16, 2021, 11:25 AM IST

Updated : Jan 16, 2021, 5:48 PM IST

ఒకప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలంటే టెక్స్ట్​ మెసేజ్​లే దిక్కు.. ఆ సమయంలో ఫ్రీ మెసేజింగ్​ సౌలభ్యంతో వాట్సాప్​ వచ్చి అందరినీ ఆకర్షించింది. యూజర్ల సమాచార గోప్యతకు హామీ ఇచ్చింది. అప్పటి నుంచి ఓ దశాబ్దం పాటు వాట్సాప్​ ఏ స్థాయికి ఎదిగిందో తెలిసిందే. వాట్సాప్​ లేని ఫోన్​ లేదంటే నమ్మశక్యం కాదు.

అయితే సరిగ్గా పదేళ్లకు వాట్సాప్​కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఇది ఇతర కంపెనీల నుంచి వచ్చింది కాదు. తాము తెచ్చిన అప్​డేటే వాట్సాప్​కు నష్టం చేసింది. వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త పాలసీపై యూజర్స్‌ ఏ స్థాయిలో అసంతృప్తితో ఉన్నారనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఎందుకు ఆందోళనన..

గతంలో ఏదైనా కంపెనీ తమ విదివిధానాల్లో మార్పులు చేస్తే వాటిని అంగీకరించాలా వద్దా అనేది యూజర్స్‌ చేతుల్లో ఉండేది. కానీ ఫేస్‌బుక్‌ అనుబంధ సంస్థ వాట్సాప్‌ తాజా పాలసీని తప్పనిసరిగా అంగీకరించాల్సిందే. లేదంటే ఆ రోజు నుంచి వారి వాట్సాప్‌ ఖాతా పనిచేయదని సంస్థ తెలపడం యూజర్స్‌కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో వాట్సాప్‌ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. అంతేకాదు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా వాట్సాప్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ యూజర్స్‌ అందరు సిగ్నల్ ఉపయోగించాలని సూచించాడు.

వెనక్కి తగ్గిన వాట్సాప్..

అయితే కొత్త ప్రైవసీ విధానంపై వాట్సాప్‌ వెనక్కి తగ్గింది. మూడు నెలల పాటు అప్‌డేట్‌ను వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత సమాచార గోప్యతపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త విధానం ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా..తాజా నిర్ణయంతో అది మరికొంత కాలం నిలిచిపోనుందని తెలిపింది. మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌పై ఇటీవల వినియోగదారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

వాట్సాప్​కు ప్రత్యామ్నాయాలు..

Tale of WhatsApp
వాట్సాప్​, సిగ్నల్​, టెలిగ్రాం మధ్య తేడాలు

వాట్సాప్​పై అసంతృప్తిగా ఉన్న యూజర్లు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఈ ప్రత్యామ్నాయాలు ఏంటి.. అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం.

సిగ్నల్..

వాట్సాప్‌కు బదులుగా ఇటీవల ఎక్కువ వినిపిస్తున్న పేరు సిగ్నల్‌. వాట్సాప్‌ తరహాలోనే ఇది కూడా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ప్రొటోకాల్‌తో పనిచేస్తుంది. కొద్ది రోజుల ముందు వరకు ఈ యాప్‌ను ఎక్కువగా జర్నలిస్టులు, విద్యావేత్తలు, పరిశోధకులు మాత్రమే ఉపయోగించేవారు. ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ తర్వాత ఈ యాప్‌ డౌన్‌లోడ్‌లు పెరిగిపోయాయి. ఒకానొక దశలో యూజర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఓటీపీలు పంపలేక సిగ్నల్‌ టీమ్‌ చేతులెత్తేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

టెలిగ్రాం..

సిగ్నల్, వాట్సాప్‌ మాదిరిగా టెలిగ్రాం సంభాషణలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ కాదు. కానీ ఇందులో సీక్రెట్ ఛాట్ ఫీచర్‌ ద్వారా మనకు కావాల్సిన వ్యక్తులతో సురక్షితంగా సంభాషించవచ్చు. అంతేకాదు టైం లిమిట్‌తో సందేశాలను పంపుకోవచ్చు. అవతలి వ్యక్తి వాటిని చూసిన వెంటనే మీరు పెట్టిన టైం లిమిట్‌ లోపల అవి డిలీట్ అయిపోతాయి. ఇందులో మెసేజ్‌ ఛాట్‌తో పాటు ఆడియో/వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. 1.5జీబీ సామర్థ్యం కలిగిన ఫైల్స్‌ని పంపుకోవచ్చు. ఒక గ్రూపులో‌ సుమారు 2 లక్షల మందిని యాడ్ చెయ్యొచ్చు.

సమాచార గోప్యత..

యాప్​ ఏదైనా.. వినియోగదారులు ఎప్పుడు, ఎంత, ఏ మేరకు వ్యక్తిగత సమాచార సేకరణకు అనుమతి ఇస్తున్నారనేది చూసుకోవాలి. పేరు, లొకేషన్, కాంటాక్ట్​ సమాచారం సహా పలు వివరాలు వ్యక్తిగత సమాచారం కిందకు వస్తాయి.

సమచార దుర్వినియోగం..

సమాచార దుర్వినియోగంపై ఇప్పటికే చాలా ఉందతాలు ఉన్నాయి. దీని ద్వారా చరవాణీలు, కంప్యూటర్లు వంటి వాటిని హ్యాకర్లు హ్యాక్​ చేసిన సందర్భాలు కోకొలల్లు.

వ్యక్తిగత సమాచార దుర్వినియోగంతో సైబర్​ నేరాలు భారీగా పెరిగాయి.

Last Updated : Jan 16, 2021, 5:48 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.