ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ టీ-సిరీస్ అరుదైన ఘనత సాధించింది. సంగీతం, సినీ నిర్మాణ రంగాల్లో వెలుగొందుతున్న ఈ సంస్థ.. యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్స్ కలిగిన ఛానల్‌గా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల(పది కోట్ల)కు పైగా సబ్‌స్క్రైబర్స్ కలిగిన ఏకైక సంస్థగా టీ- సిరీస్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
గిన్నీస్ ప్రతినిధి రిషినాథ్ చేతుల మీదగా టీ-సిరీస్ యజమాని భూషణ్ కుమార్ రికార్డు ధ్రువపత్రాన్ని అందుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా..
టీ-సిరీస్‌కు భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బ్రిటన్, అమెరికా, ఐరోపా, పశ్చిమాసియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా చాలా దేశాల్లో టీ-సిరీస్ సంగీత ప్రియుల్ని ముగ్ధులను చేస్తోంది.
2011 జనవరిలో ప్రారంభించిన టీ-సిరీస్ ఛానల్‌కు మొత్తం 29 ఉపఛానళ్లు ఉన్నాయి. ఏడాదిన్నర కాలంలో నెటిజన్లు అత్యధికంగా వీక్షించిన ఛానల్ ఇదే కావటం విశేషం.
-
From my father's visionary record label to today reaching for world records with the team's support, we have come a long way! Thank you @GWR for the recognition of being The 'First YouTube channel to cross 100M subscribers.' I owe this all to my father and my team! pic.twitter.com/hzwSuaiHfs
— Bhushan Kumar (@itsBhushanKumar) June 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">From my father's visionary record label to today reaching for world records with the team's support, we have come a long way! Thank you @GWR for the recognition of being The 'First YouTube channel to cross 100M subscribers.' I owe this all to my father and my team! pic.twitter.com/hzwSuaiHfs
— Bhushan Kumar (@itsBhushanKumar) June 14, 2019From my father's visionary record label to today reaching for world records with the team's support, we have come a long way! Thank you @GWR for the recognition of being The 'First YouTube channel to cross 100M subscribers.' I owe this all to my father and my team! pic.twitter.com/hzwSuaiHfs
— Bhushan Kumar (@itsBhushanKumar) June 14, 2019
"ఇది భారత్ శక్తి. భారతీయత కలిగిన కంటెంట్, వీక్షకుల ఆదరణ, మా డిజిటల్ టీం కృషి ఫలితంగానే యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించుకోగలిగాం."
-భూషణ్ కుమార్, టీ సిరీస్ ఎండీ
19 ఏళ్లకే బాధ్యతగా..
చలన చిత్ర రంగంలో తొలిరోజుల్లో ఓ వెలుగు వెలిగింది టీ సిరీస్. సంస్థ వ్యవస్థాపకుడు గుల్షణ్ కుమార్ సారథ్యంలో సినిమా సంగీతానికి ఆశ్రయమిచ్చింది. ఆయన అకాల మరణంతో 19 ఏళ్లకే భూషణ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. మధ్యలో కొన్ని ఒడుదొడుకులు ఎదురైనా అనూహ్య వ్యూహాలతో సంస్థను శిఖరాగ్రాన నిలబెట్టారు.
ఇదీ చూడండి: లాంఛనంగా ప్రారంభమైన బాలకృష్ణ 'రూలర్'