ETV Bharat / business

'ఆల్ఫాబెట్​​ సీఈఓ'గా సుందర్​​ పిచాయ్​ పారితోషికం తెలుసా?

భారత సంతతికి చెందిన టెకీ సుందర్​ పిచాయ్​ పారితోషికం వచ్చే ఏడాది భారీగా పెరగనుంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్​ ముఖ్య కార్యనిర్వాహక అధికారి(సీఈఓ)గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన పిచాయ్​కు వచ్చే ఏడాది నుంచి వార్షిక వేతనం 2 మిలియన్​ డాలర్లకు అదనంగా 240 మిలియన్​ డాలర్ల విలువైన స్టాక్​ అవార్డు లభించనునుంది.

GOOGLE
సుందర్​ పిచాయ్
author img

By

Published : Dec 21, 2019, 3:03 PM IST

Updated : Dec 21, 2019, 4:56 PM IST

గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సుందర్‌ పిచాయ్‌కి భారీగా పారితోషికం పెరిగింది. ఆయనకి రెండు మిలియన్ డాలర్ల వార్షిక వేతనంతో సహా‌, సంతృప్తికరమైన పనితీరుతో లక్ష్యాలను చేరుకోగలిగితే 2020 నుంచి మూడు సంవత్సరాల పాటు 240 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.17,07,07,20,000) విలువ చేసే స్టాక్‌ అవార్డు లభించనుంది. అంతేకాకుండా ఆల్ఫాబెట్‌ షేర్ల విలువ పెరుగుదలకు అనుగుణంగా 90 మిలియన్‌ డాలర్ల విలువగల షేర్లు అదనపు బోనస్‌గా లభించనున్నాయి.

ఈ విధంగా పనితీరును బట్టి షేర్లను బోనస్‌గా ఇవ్వటం ఆల్ఫాబెట్‌ కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. లారీ పేజ్‌ నిష్క్రమణ అనంతరం డిసెంబర్‌ 3న పిచాయ్‌ ఆల్ఫాబెట్‌ పగ్గాలు చేపట్టారు. అయితే మాజీ అధ్యక్షులు, గూగుల్‌ సహవ్యవస్థాపకులు లారీ పేజ్‌, సెర్గే బ్రిన్‌లకు గూగుల్‌లో 6 శాతం వాటాలుండగా సుందర్‌కు ఆ రూపంలో పరిహారం ఏమీ లభించలేదు.

ఉద్యోగి అభ్యంతరం..

గూగుల్‌ సంస్థలో అంతర్గత సంఘర్షణల అణచివేత అనంతరం ఉద్యోగులు, యాజమాన్యం మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ సంవత్సరం జరిగిన ఒక ఉద్యోగుల సమావేశంలో 'సిలికాన్‌ వ్యాలీలో ఎంతో మంది ఉద్యోగులు తమ మనుగడ కోసం కష్టపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పిచాయ్‌కి అంత పారితోషికం అవసరమా?' అంటూ ఒక ఉద్యోగి ప్రశ్నించాడు.

అయితే 47 సంవత్సరాల ఈ ఇంజినీర్‌కు భారీ ప్యాకేజీలు కొత్తేమీ కాదు. సుందర్‌ 2016లో 200 మిలియన్‌ డాలర్లను స్టాక్‌ అవార్డు రూపంలో పొందారు. 2018లో ఆయన మొత్తం వేతనం 1.9 మిలియన్‌ డాలర్లు. అదే సంవత్సరం షేర్ల రూపంలో ఇవ్వబోయిన మరో భారీ బోనస్‌ను సుందర్ వద్దనటం గమనార్హం.

ఇదీ చూడండి:ఉల్లి ఘాటు తీరిందో లేదో.. ఇక వంట నూనెల మంట!

RS Pura (JandK), Dec 21 (ANI): Border Security Force (BSF) Jawans have left no stone unturned to ensure safety of the people of the nation and they are patrolling at LoC in the freezing weather in JandK's RS Pura. Temperature constantly clocking zero to minus degrees has failed to divert jawans' attention. One of the BSF Jawans said, "We stay alert at the border all the time, no matter if it's raining, sunny or winters. We cannot rest as it will lead to problems to our citizens. People of country are soundly sleeping because they trust us." BSF jawans are known for their sharp alertness even in harsh weather conditions.
Last Updated : Dec 21, 2019, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.