ETV Bharat / business

మదుపరుల అప్రమత్తత.. ఒడుదొడుకుల్లో సూచీలు - సెన్సెక్స్​

స్టాక్ మార్కెట్లు నేడు ఒడుదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. గత సెషన్ల​లో వచ్చిన భారీ లాభాల కారణంగా మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్​ 15 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 6 పాయింట్లు క్షీణించింది.

స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : May 28, 2019, 10:08 AM IST

స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారుకున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 15 పాయింట్లు క్షీణించి ప్రస్తుతం 39,668 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 11,918 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

లాభనష్టాల్లోనివివే..

ఎస్​ బ్యాంకు, వేదాంత, కోల్ ఇండియా, టీసీఎస్​, ఏషియన్​ పెయింట్స్​, ఇన్ఫోసిస్​, పవర్​ గ్రిడ్​ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

హెచ్​డీఎఫ్​సీ, ఎల్​ & టీ, హీరో మోటార్స్​, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్​, కోటక్​ బ్యాంకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి, ముడిచమురు

నేటి సెషన్ ప్రారంభంలో రూపాయి 21 పైసలు వృద్ధి చెందింది. ప్రస్తుతం డాలర్​తో రూపాయి మారకం విలువ 69.72 వద్ద ట్రేడవుతోంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.15 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 68.67 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.