ప్రారంభ లాభాలతో నేడు జీవనకాల గరిష్ఠాలను తాకాయి సూచీలు. నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ దాదాపు 85 పాయింట్లు బలపడింది. ప్రస్తుతం 39,437 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 11,853 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
లాభానష్టాల్లో....
హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫినాన్స్, సన్‌ఫార్మా, రిలయన్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
టాటా మోటార్స్, ఎస్ బ్యాంకు, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.