అంతర్జాతీయంగా, దేశీయంగా ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ బలమైన కొనుగోళ్ల మద్దతుతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం దాదాపు 200 పాయింట్లు బలపడి.. 37,580 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 11,305 వద్ద కొనసాగుతోంది.
లాభానష్టాల్లోనివే
బజాజ్ ఫినాన్స్, హీరో మోటార్స్, యస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, ఎం&ఎం షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, వేదాంత, ఓఎన్జీసీ, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ఇండిగో ప్రమోటర్ల మధ్య వివాదం కారణంగా వరుసగా రెండో రోజు సంస్థ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఇవీ కారణాలు
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఫలితాలపై అంచనాలు సహా అమెరికా-చైనా మధ్య వాణిజ్య భయాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ మదుపరుల సెంటిమెంట్ బలంగా ఉండి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారని స్టాక్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఐటీ, ఆర్థిక, లోహ రంగాల సానుకూల ట్రేడింగ్ నేటి లాభాలకు ప్రధాన కారణం.
రూపాయి, ముడిచమురు
ట్రేడింగ్ ఆరంభంలో రూపాయి 29 పైసలు క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.32 వద్ద కొనసాగుతోంది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.30 శాతం పెరిగింది. బ్యారెల్ ముడిచమురు ధర ప్రస్తుతం 72.84 డాలర్లకు చేరింది.
అసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లయిన చైనా, జపాన్, దక్షిణ కొరియా సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
ఇదీ చూడండీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ దారి ఎటు...?