అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ సంకేతాలు సహా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు నేడు మందకొడిగా ప్రారంభమయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 60 పాయింట్లు బలపడి.. 37,185 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంతో 11,170 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
లాభానష్టాల్లోనివే
టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, వేదాంత, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
కోటక్ మహీంద్రా బ్యాంకు, కోల్ ఇండియా, సన్‌ఫార్మా, ఎం&ఎం, ఎల్&టీ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి, ముడి చమురు
సెషన్ ప్రారంభంలో రూపాయి స్వల్పంగా పుంజుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.31 వద్ద కొనసాగుతోంది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.56 శాతం పెరిగింది. బ్యారెల్ ముడి చమరు ధర 72.17 డాలర్లకు చేరింది.
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.