మిడ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి.
ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నప్పటికీ మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా రికార్డు స్థాయిలు నుంచి వెనక్కి తగ్గాయి సూచీలు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 214 పాయింట్ల లాభంతో ప్రస్తుతం 39, 324 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 11,811 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
లాభనష్టాల్లోని షేర్లు ఇవే
ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, హీరో మోటార్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, రిలయన్స్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఐటీసీ, వేదాంత, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టీసీఎస్, టాటా మోటార్స్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.