స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 36 పాయింట్లు క్షీణించి 39,032 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో.. 11,748 వద్ద సెషన్ ముగించింది.
మేడే, మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్లకు రేపు సెలవు.
ఇవీ కారణాలు
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం బుధవారం వెలువడనుంది. ఈ కారణంగా విదేశీ మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. వీటికి తోడు బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు నేటి నష్టాలకు ప్రధాన కారణాలు. యస్ బ్యాంకు షేర్ల భారీ పతనం కూడా మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి.
మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లుగానే ఆరంభంలో భారీ నష్టాలతో కలవరపరిచిన మార్కెట్లు.. చివరకు స్వల్ప నష్టాలకే పరిమితమయ్యాయి.
ఇంట్రాడే సాగిందిలా
సూచీ | గరిష్ఠం | కనిష్ఠం |
సెన్సెక్స్ | 39,105.88 | 38,753.46 |
నిఫ్టీ | 11,748.75 | 11,655.90 |
లాభానష్టాల్లోనివివే
సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్‌టెక్ అత్యధికంగా 4 శాతం లాభపడింది. ఈ వరుసలో టాటా స్టీల్ 2.10 శాతం, హచ్డీఎఫ్సీ 1.77 శాతం, ఇన్ఫోసిస్ 1.74 శాతం, కోల్ ఇండియా 1.34 శాతం, హెచ్డీఎఫ్సీ 1.06 శాతం లాభపడ్డాయి.
నష్టాల జాబితాలో యస్ బ్యాంకు షేర్లు 29.23 శాతం భారీ నష్టాన్ని నమోదు చేశాయి. ఇండస్ఇండ్బ్యాంకు 5.21 శాతం, హీరోమోటోకార్ప్ 3.51 మారుతి 2.54 శాతం, పవర్ గ్రిడ్ 2.36 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.