ETV Bharat / bharat

ఝార్ఖండ్‌లో రెండో దశ పోలింగ్​ - పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు

JHARKHAND ELECTIONS SECOND PHASE
JHARKHAND ELECTIONS SECOND PHASE (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Jharkhand Assembly Elections 2024 Live Updates : ఝార్ఖండ్‌లో చివరిదైన రెండో విడతకు సంబంధించి 38 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగించనున్నారు.

LIVE FEED

8:53 AM, 20 Nov 2024 (IST)

నా యువ స్నేహితులను అభినందిస్తున్నా : ప్రధాని మోదీ

"ఈరోజు ఝార్ఖండ్​లో చివరి రెండో దశ పోలింగ్. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరూ ఉత్సాహంగా పాల్గొని పోలింగ్​లో రికార్డు సృష్టించాలని కోరుతున్నా. తొలిసారిగా ఓటు వేయబోతున్న నా యువ స్నేహితులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మీ ప్రతి ఓటు రాష్ట్రానికి బలం" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

7:02 AM, 20 Nov 2024 (IST)

పోలింగ్ స్టార్ట్​

ఝార్ఖండ్​లో రెండో దశలో 38 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

6:51 AM, 20 Nov 2024 (IST)

ఝార్ఖండ్‌లో మొత్తం 81 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వాటిలో తొలి విడతలో ఈనెల 13న 43స్థానాలకు పోలింగ్ జరిగింది. 43 స్థానాలకు 683 మంది అభ్యర్థులు పోటీపడగా 66.18 శాతం పోలింగ్ నమోదైంది. ఝార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ కలిసి మహాఘట్‌బంధన్‌ పేరుతో పోటీ చేస్తున్నాయి. బీజేపీ, ఆల్ ఝార్ఖండ్‌ స్టూడెంట్ యూనియన్‌, JDU, లోక్‌జన్‌ శక్తి రామ్ విలాస్‌ పార్టీ కలిసి NDA కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఝార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.