Pawan Kalyan OG Movie First Single : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి రానున్న చిత్రాల్లో 'ఓజి' కూడా ఒకటి. దర్శకుడు సుజిత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీని పాన్ ఇండియా చిత్రంగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు.
OG Movie Shooting Update : ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాలోని తొలి గీతాన్ని వినిపించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ఈ సాంగ్‌ను విడుదల చేస్తారని సమాచారం. వాస్తవానికి సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగానే ఈ ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ అప్పుడు కుదరలేదు. ఎందుకంటే అప్పటికీ ఏపీలో ఉన్న వరదల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని విడుదల చేయలేదు.
ఇప్పుడా సాంగ్‌నే కొత్త ఏడాది రోజున విడుదల చేయనున్నట్లు సమాచారం అందింది. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయకుడిగానే ఇమ్రాన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కూడా ఓ పాట పాడారు.
Pawan Kalyan Upcoming Movies : ఇకపోతే రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిన పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు కూడా పూర్తి చేయాల్సి ఉంది. హరి హర వీరమల్లు షూటింగ్ రీసెంట్‌గానే పవన్ లేకుండా ప్రారంభమైంది. కానీ భగత్ సింగ్ మాత్రం షురూ కాలేదు. తాత్కాలికంగా నిలిచిపోయింది. కాగా, పవన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మధ్యలో సినిమాలకు సమయం కేటాయిస్తున్నారు. అప్పుడప్పుడు షూటింగ్లలో పాల్గొంటున్నారు.
29 ఏళ్ల వివాహ బంధానికి ఏఆర్ రెహమాన్ దంపతులు స్వస్తి
ప్రభాస్, హను రాఘవపూడి 'ఫౌజీ' అప్డేట్ - షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందంటే?